అప్పుకు ఆమడ దూరం
ముంబై: ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారతీయుల్లో రుణ విముఖత క్రమంగా పెరుగుతోంది. అదే సమయంలో విచక్షణారహితమైన ఖర్చులకు వారు చెక్ పెట్టడం పెరిగిందని మాస్టర్ కార్డ్ వరల్డ్ వైడ్ ఇండెక్స్ అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం భారతీయులు విలాసవంతమైన ఖర్చులకు స్వస్తి చెప్పి రాబోయే ఏడాది కాలంలో ప్రాథామ్యతా ఖర్చులపై అధికంగా కేంద్రీకరిస్తున్నారని ఆసియా పసిఫిక్ రీజియన్ వినియోగదారుల కొనుగోలు ప్రాథామ్యాల్ని గణించే మాస్టర్ కార్డ్ వరల్డ్ వైడ్ ఇండెక్స్ గుర్తించింది.
పిల్లల చదువుల కోసం 63.1 శాతం, ఆస్తుల కొనుగోలుపై 42.4 శాతం, ఇన్వెస్టమెంట్స్ పై 35.1 శాతం, పదవీ విరమణ అనంతర ఖర్చుల కోసం 21.3 శాతం తమ ఆదాయంలో ఆదా చేస్తున్నట్లు పై అధ్యయనానికి ఎంపిక చేసిన భారతీయుల్లో 92 శాతం మంది తెలిపారు. ప్రపంచ ఆర్దిక సంక్షోభ పరిస్థితుల్ల మధ్య ఆసియాలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే భారతీయులు ఒక పథకం ప్రకారం ఖర్చు చేసేందుకు అధిక ప్రాధాన్యత నిస్తున్నారని ఆ అధ్యయనం వెల్లడించిది. పిల్లల చదువుల పట్ల బాధ్యతాయుతంగా డబ్బు పొదుపు చేస్తున్నారని, వికాసంలో చేసిన దుబారా ఖర్చులను భారతీయులు పక్కన బెట్టినట్లు దక్షిణాసియా మాస్టర్ కార్డ్ వరల్డ్ వైడ్ భారత దేశ జనరల్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ టివి శేషాద్రి తెలిపారు.
అధ్యయనానికి ఎంపికైన భారతీయుల్లో 65 శాతం మంది తాము తమ వార్షిక ఆదాయంలో 10 శాతానికి పైగా, వారిలో 14 శాతం మంది 40 శాతానికి పైగా విచణాయుతమైన వస్తువుల కొనుగోలుపై ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. భారతీయులు స్వతహాగా రుణ విముఖతను కలిగి ఉన్నట్లు ఆ అధ్యయనం తెలిపింది. భారత దేశంలోని మెజారిటీ విచక్షణాయుత ఖర్చు పిల్లల చదువులు, గృహ నిర్మాణం, ఆరోగ్యాలపై ఖర్చుచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది. కొత్త తరం ఎంటర్ టైన్మెంట్ పై, తీరిక వేళల్లో సరదాగా గడపడంపై ఎక్కువగా ఖర్చుచేస్తోంది. అయితే భారతీయులు సహజంగానే పొదుపు స్వభావం కలవారని రెలిగార్ సెక్యూరిటీస్, రీసెర్చ్ అధిపతి అమితాబ్ చక్రవర్తి తెలిపారు.
Pages: 1 -2- News Posted: 19 February, 2009
|