అప్పుకు ఆమడ దూరం
ఆసియా పసిఫిక్ వినియోగదారుల్లో 70 శాతం మంది విచక్షణాయుతమైన ఖర్చులు చేసేందుకు సిద్ధపడ్డారు. వారిలో 39 శాతం మంది 20 శాతం పైగా తమ ఆదాయాన్ని పొదుపు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసారు. ఈ ఇండెక్స్ ఇప్పటి నుండి వినియోగదారుల స్వభావాన్ని అంచనా వేసి ఏడాదికొక నివేదికను విడుదల చేస్తుంది. ఈ ఏడాది కాలంలో వినియోగదారుల ధోరణిలో వస్తున్న మార్పులను ఈ ఇండెక్స్ అంచనా వేస్తుంది. ఆసియా పసిపిక్ ప్రాంతంలోని ప్రజల్లో 60 శాతం మంది తమ వార్షిక ఆదాయంలో 10 శాతానికి పైగా విచక్షణాయుత అంశాలపై ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది కాలంలో మగ వినియోగదారులు విచక్షణాయుత వ్యయం 69 శాతంలో కొంత భాగం కోత పెడుతున్నట్లు, ఆడ వినియోదారుల వ్యయం 71 శాతంలో స్వల్ప పెరుగుదల ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 56 ఏళ్లు, అంతకు పైబడ్డ వినియోగదారుల్లోని 72 శాతం మంది కంటే, 30 ఏళ్లు అంతకు లోపు వినియోగాదారుల్లో 68 శాతం మంది దుబారా ఖర్చు పెట్టడం మానేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది విచక్షణాయుత ఖర్చుల్లో విందులు, వినోదాలు అగ్ర స్థానాన్ని (59 శాతం) ఆక్రమించనున్నాయి. క్రమంగా ఫ్యాషన్, యాక్ససరీస్ పై 46 శాతం, పిల్లల చదువుపై 44 శాతం, వ్యక్తిగత ప్రయాణాలపై 42 శాతం వ్యయం చేసే అవకాశాలున్నాయి. 14 మార్కెట్ సర్వేల్లో 11 సర్వేలు విందు వినాదాలకు చేసే వ్యయ ప్రాథామ్యత పెరగనుందని తెలియజేశాయి. భారత, కొరియాలను మినహాయిస్తే పిల్లల చదువుపా ఫిలప్పైన్స్ అధిక ప్రాధాన్యత నిస్తున్నట్లు తెలుస్తోంది.
Pages: -1- 2 News Posted: 19 February, 2009
|