రాజకీయం రెండో ఇన్నింగ్స్!
సిద్ధూ కంటె చాలా ముందుగా భారత మాజీ ఓపెనర్ చేతన చౌహాన్ ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహా నుంచి లోక్ సభకు పోటీ చేయడానికి బిజెపి టిక్కెట్ పొందాడు. ఓపెనర్ గా తన కాలంలో ఎంత పరిస్థితులకు తనను తాను మలచుకునే గుణం కనబరిచాడో రాజకీయ నాయకుడుగా కూడా అదే విధంగా రాణించాడు. 1991, 1998 సంవత్సరాలలో రెండు సార్లు పార్లమెంట్ కు చౌహాన్ ఎన్నికయ్యాడు.
కీర్తి అజాద్ తండ్రి భగవత్ ఝా అజాద్ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు. కాని ప్రపంచ కప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు సభ్యుడైన కీర్తి అజాద్ 1993లో న్యూఢిల్లీలోని గోలె మార్కెట్ నియోజకవర్గం నుంచి బిజెపి టిక్కెట్ పై ఎంఎల్ఎగా ఎన్నికయ్యాడు. ఆతరువాత అతను 1999లో బీహార్ లోని దర్భాంగా నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు కాని ఆతదుపరి ఎన్నికలలో ఓడిపోయాడు.
ఇక స్వరాష్ట్రం హర్యానాలోని ఫరీదాబాద్ నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి) టిక్కెట్ కేటాయించగలమనే హామీని కొన్ని నెలల ముందుగానే పొందిన మాజీ సీమర్ చేతన్ శర్మ ఇప్పటికి చాలా కాలంగా ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాడు. పార్టీ అధినేత్రి మాయావతి గురించి, రాజకీయాలలో క్రికెటర్ల సామర్థ్యం గురించి అతను సిసలైన రాజకీయ నాయకుని మాదిరిగా గొప్పలు చెబుతున్నాడు.
'నేను క్రికెట్ ను చాలా కష్టపడి నేర్చుకున్నాను. బహన్ జీ (మాయావతి) నుంచి రాజకీయాలను నేర్చుకోవాలనే ఆసక్తితో ఉన్నాను' అని చేతన్ శర్మ తీరిక లేని కార్యక్రమాల మధ్య మీడియాతో చెప్పాడు. 'రాజకీయ నాయకుడుగా కూడా కష్టపడి పని చేయాలి. క్రికెటర్లు ఇందుకు అనువైన వారేనని నా భావన' అని అతను చెప్పాడు.
Pages: -1- 2 -3- News Posted: 20 February, 2009
|