రాజకీయం రెండో ఇన్నింగ్స్!
ఇటీవలి వరకు జాతీయ క్రికెట్ సెలక్టర్ గా ఉన్న భారత అండర్ 19 జట్టు మాజీ కెప్టెన్ రంజీబ్ బిశ్వాల్ కూడా రాజకీయ నాయకుడుగా విజయాన్ని చవి చూశాడు. అతను ఒరిస్సాలోని జగత్ సింగ్ పూర్ నుంచి ఎంపిగా ఎన్నికయ్యాడు. అయితే, రాజకీయ నాయకుడైన తన తండ్రి స్వర్గీయ బసంత్ బిశ్వాల్ వారసత్వమే అందుకు కారణం.
అయితే, రాజకీయాలలో విజయాలు సాధించలేని వారు కూడా ఉన్నారు. రాజ కుటుంబాలకు రాజ భరణాల రద్దుకు నిరసనగా పటౌడీ విశాల్ హర్యానా పార్టీ టిక్కెట్ పై 1971 ఎన్నికలలో పోటీ చేశాడు కాని నెగ్గలేకపోయాడు. 1996 ప్రపంచ కప్ అనంతరం జట్టులో నుంచి తనకు ఉద్వాసన పలికిన అనంతరం మనోజ్ ప్రభాకర్ దక్షిణ ఢిల్లీలో కాంగ్రెస్ (ఎన్ డి తివారి) టిక్కెట్ పై పోటీ చేశాడు. ఇక సౌరవ గంగూలి, అజయ్ జడేజా వంటి క్రికెటర్లు తమకు వచ్చిన ప్రతిపాదనలను తోసిపుచ్చినట్లు తెలుస్తున్నది. కాని వినోద్ కాంబ్లి వంటి వారు ముంబైలో లోక్ భారతి పార్టీలో సంతోషంగా చేరారు. సినీ తారలు చాలా సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఎన్నికలలో క్రమం తప్పకుండా పోటీ చేస్తూనే ఉన్నారు. కాని ఇప్పుడు క్రికెటర్లే కొత్త ఆకర్షణ శక్తి అయినట్లుంది.
Pages: -1- -2- 3 News Posted: 20 February, 2009
|