సల్మాన్ డ్రింక్ లాక్కున్న అమీర్
సల్మాన్, అమీర్ లకు సంబంధించి ఒకింత ఫ్లాష్ లోకి వెళ్తే...ఇద్దరూ కలిసి 'అందాజ్ అప్నా అప్నా'లో నటించారు. సల్మాన్ తో మళ్లీ నటించేది లేదని ఆ తరుణంలోనే అమీర్ మీడియాతో చెప్పడమూ జరిగింది. అయితే ఆ తర్వాత క్రమంలో ఇద్దరి మధ్యా ఈక్వేషన్లు మారి క్రమంగా సౌహార్ద్ర వాతావరణం ఏర్పడింది.
సల్మాన్ తాగుడు మానేసిన విషయాన్నిఆయన సన్నిహితుడు సలీమ్ ఖాన్ ధ్రువీకరించారు. 'వీర్ సినిమాలో స్లిమ్ గా, ట్రిమ్ గా ఉండేందుకు గాను సల్మాన్ మందు ముట్టడం లేదు. ఈ సినిమాలో సల్మాన్ తన బాడీని చూపించే సన్నివేశాలు కూడా చాలానే ఉన్నాయి. మజిల్ టోన్ తో ఆయన కనిపించాల్సి ఉంటుంది' అని ఆయన తెలిపారు. ఇప్పటికైతే సల్మాన్ మందు ముట్టడం లేదనీ, అమీర్ సూచనలను పాటించడం వల్లనే సల్మాన్ మందుకు దూరంగా ఉన్నారా అనేది తాను నిశ్చయంగా చెప్పలేననీ, అయితే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అనడంలో సందేహం లేదనీ ఆయన వివరణ ఇచ్చారు.
Pages: -1- 2 News Posted: 21 February, 2009
|