కేసీఆర్ తిరకాసు!
రెండు పార్టీలు కలిసి పోటీచేస్తున్నప్పుడు, మిత్రపక్షానికి నష్టం కలుగకుండా వ్యవహరించాల్సిన బాధ్యత టిఆరెస్ పై వుంటుందని, కానీ ఆపార్టీ అధ్యక్షుడు మాత్రం ఒంటెద్దు పోకడలు పోతున్నారని దేశం నాయకులు విమర్శించారు. మహాకూటమిలో చేరుతున్నట్టు ప్రకటించక ముందు కొన్ని జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్ధులుగా కొంతమంది పేర్లు ప్రకటించారు. కూటమిలో చేరిన తరువాత కూకట్ పల్లి, మక్తల్ నియోజకవర్గా్లలో టిఆరెస్ పోటీచేస్తున్నట్లు కెసిఆర్ ప్రకటించారు. అయితే, కూటమిలో చేరకముందు టిఆరెసం అభ్యర్ధులను ప్రకటించిన నియాజకవర్గాల నాయకులు చంద్రబాబును కలిసి, జిల్లాలో తెలుగుదేశం పరిస్థితే బాగుందని, సీట్ల సర్దుబాటు వద్దని కోరారు.
ఆదిలాబాద్ జిల్లాలో టిఆరెస్ ముగ్గురు అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తే, ఆ మూడు నియోజకవర్గాల నాయకులు చంద్రబాబును కలిసి ఆ స్థానాలను టిఆరెస్ కు కేటాయించవద్దని డిమాండ్ చేశారు. అదే విధంగా మెదక్ జిల్లా రామాయంపేట, మెదక్ నయోజకవర్గాలను టిఆరెస్ కు ఇవ్వవద్దని ఆ ప్రాతం నాయకులు చంద్రబాబును కోరితే, వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారని తెలిసింది.
Pages: -1- 2 News Posted: 22 February, 2009
|