పతీ, పత్నీ ఔర్ పోస్ట్!
శివశంకర్ మీనన్ తరువాత విదేశాంగ శాఖ కార్యదర్శిగా ప్రస్తుతం చైనాలో రాయబారిగా ఉన్న నిరుపమా రావును నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలి విదేశాంగ శాఖ కార్యదర్శుల కెరీర్ గ్రాఫ్ లను సూచికగా తీసుకుంటే నిరుపమ సివి ఇందుకు అనువైనదిగా ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె కొలంబోలో కూడా రాయబారిగా పని చేశారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) సారథ్యంలోని ఎన్ డిఎ అధికారంలో ఉన్నప్పుడు ఆమె విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ఇంకా మూడు నెలల వ్యవధి ఉండడంతో, కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వం ఇతర కీలక పదవులలో నియామకానికి అధికారుల పేర్ల పరిశీలనను ప్రారంభించింది. కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి మధుకర్ గుప్తాకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) డిప్యూటీ గవర్నర్లలో ఒకరికి, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సి) సభ్యులలో ఒకరికి వారసుల కోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నది. హోమ్ శాఖ కార్యదర్శి పదవికి మూడు పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. జి.కె. పిళ్ళై, కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి అనురాగ్ గోయల్, రెవెన్యూ శాఖ కార్యదర్శి పి.వి. భిడె పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే, పిళ్ళై క్యాబినెట్ కార్యదర్శి పదవిపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
ఇక ఆర్ బిఐ డిప్యూటీ గవర్నర్ పదవి కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎండి టి. నారాయణస్వామి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిఎండి కె.సి. చక్రవర్తి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి. ఎన్ హెచ్ఆర్ సి సభ్యుడుగా ఇస్లామాబాద్ లోని భారత రాయబారి సత్యవ్రత పాల్ నే నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాల్ ఈ నెల 28న రిటైరవుతున్నారు.
Pages: -1- 2 News Posted: 22 February, 2009
|