సైంటిస్టులకు 'ఈక్విటి'
దీంతో ప్రభుత్వ పరిశోధనా సంస్థల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఒక నిర్ణీత కాలం (షుమారుగా రెండేళ్లపాటు) పారిశ్రామిక రంగంలో కృషి చేసేందుకు అవకాశం కలుగుతుంది. పలు సంస్థల మధ్య అవరోధాలు లేకుండా ఉంటే, సాంకేతిక పరిజ్ఞాన మారకం సులవవుతుందని ఒక అధికారి తెలిపారు. ఈ విధానం స్పేస్, అణు విద్యుత్, రక్షణ పరిశోధన విభాగాలు మినహా ప్రభుత్వ పరిశోధక కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్, టెక్నాలజీ కాలేజీలన్నిటికి వర్తిస్తుంది. అయితే ఈ విధానం అమలులోకి వచ్చేందుకు ముందుగా, పలు కౌన్సిల్స్ తాము రూపొందించుకున్న ప్రత్యేక నియమ నిబంధనలను సవరించవలసి ఉంటుంది. అయితే సృజనాత్మకంగా వ్యవహరిస్తూ పరిశోధన, అకాడమిక విధులను నిర్వహించడమన్నది పైకి కనిపించినంత సులువైన వ్యవహారం కాదని వ్యాపారంలో విజయవంతమైన శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు.
'పారిశ్రామిక రంగంలోను, పరిశోధనా సంస్థల్లోను పనిచేసే శాస్త్రవేత్తలకు సైంటిఫిక్ లేదా అకాడమిక సంస్థలు తగినంత వెసులుబాటు కల్పించాలి' అని స్ట్రాండ్ జెనోమిక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రమేష్ హరిహరన్ తెలిపారు. బెంగుళూరు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సి)కి చెందిన నలుగురు శాస్త్రవేత్తలు ఎనిమిదేళ్ల క్రితం స్ట్రాండ్ జెనోమిక్స్ సంస్థను ఏర్పాటు చేశారు. 'ఒక్కొక్కసారి రెండు రకాల విధులను నిర్వర్తించడం చాలా కష్టంగా ఉంటుంది'అని హరిహరన్ తెలిపారు. పరిశోధకుడు-ఆధునీకరణ ఉద్యమానికి ఐఐఎస్ సి మొట్టమొదటగా ప్రారంభించింది. ఐఐఎస్ సి-బిలో పరిశోధకునిగా పనిచేస్తున్న హరిహరన్ తో సహా మరో మగ్గులు శాస్త్రవేత్తలకు తొలిసారిగా బయోఇన్ఫర్మేటిక్స్, జెనోమిక్స్ కు సంబంధించిన సొంత కంపెనీని ఏర్పాటు చేసుకునేందుకు ఆ ప్రభుత్వ సంస్థ అనుమతించింది.
Pages: -1- 2 News Posted: 25 February, 2009
|