ట్వంటీలో కివీస్ బోణీ
క్రైస్ట్ చర్చ్: చాలాకాలం తరువాత స్వదేశంలో ప్రారంభమైన భారత క్రికెట్ జట్టు పర్యటనలో కివీస్ బోణీ కొట్టింది. బుధవారం ఇక్కడ జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వికెట్ కీపర్, ఓపెనింగ్ బ్యాట్స్ మన్ బ్రెండన్ మెకల్లమ్ భారత జట్టుకు, విజయానికి అర్ధ సెంచరీతో అడ్డుపడి, మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జాకబ్ ఓరమ్ రెండో వైపు అతడికి చక్కగా సహకరించి విన్నింగ్ షాట్ కొట్టాడు. మొదటినుంచే భారీ స్కోరుకోసం తాపత్రయ పడకుండా, ఓ వైపు వికెట్లు కాపాడుకుంటూనే లక్ష్యం సాధించడానికి వెట్టోరి జట్టు అనుసరించిన వ్యూహం అభినందనీయం.
ఇక మొదటికి వస్తే, టాస్ ఓడిపోయి తొలుతబ్యాటింగ్ చేసిన భారత జట్టు దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓ పక్క స్కోరు బోర్డును పరిగెత్తిస్తూనే, మరో వైపు అదే వేగంతో వికెట్లు పోగొట్టుకుంది. వన్ డౌన్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా అందరికంటె ఎక్కువ పరుగులు(43 బంతుల్లో 61) చేసి నాటౌట్ గా మిగిలాడు. నిలకడగా, నిబ్బరంగా ఆడకపోవడం వల్లే ఓటమిపాలయ్యామని కెప్టెన్ ధోని అంటూ, ముందు ముందు మరీ ఇంత దూకుడు ప్రదర్శించకుండా ఆడాలని సహచరులకు హితబోధ చేశాడు. భారత జట్టులో గౌతమ్ గంభీర్ 6, సెహ్వాగ్ 26, సురేశ్ రైనా 61, యువరాజ్ సింగ్ 1, ధోని 2, యూసుఫ్ పఠాన్ 20, ఇర్ఫాన్ పఠాన్ 12, హర్భజన్ సింగ్ 21 పరుగులు చేసి, 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 162 పరుగులకు చేర్చ గలిగారు.
Pages: 1 -2- News Posted: 25 February, 2009
|