ట్వంటీలో కివీస్ బోణీ
మ్యాచ్ మొత్తం మీద థ్రిల్లింగ్ సంఘటన, వరుసగా మూడు సిక్సర్లు కొట్టిన యూసుఫ్ పఠాన్ అసాధారణమైన రీతిలో ఔటవడం. గాలిలో అతి వేగంగా బౌండరీ లైను వైపు దూసుకుపోతున్న బంతిని జాకబ్ ఓరమ్ లైనుకు కొన్ని అంగుళాల లోపల క్యాచ్ పట్టి, పరగును ఆపుకో లేక బౌడరీ లైనును తాను దాటే లోపలే బంతిని మళ్లీ గాలిలోకి విసిరి, త్రుటిలో లైను లోపలకు వచ్చి బంతిని మళ్లీ అందుకోవడం చూసిన వారిని రోమాంచితులను చేసింది.
కివీస్ జట్టులో రైడర్ 1, బ్రెండన్ మెకల్లమ్ 56, మార్టిన్ గుప్టిల్ 41, రాస్ టేలర్ 31, జాకబ్ ఓరమ్ 29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, హర్భజన్ సింగ్ తలో వికెట్ పడగట్టారు.
కొస మెరుపు: బుధవారం నాటి మ్యాచ్ లో ట్వంటీ20 ఇంటర్నేషనల్స్ కు సంబంధించి రికార్డు సంఖ్యలో సిక్సర్లు నమోదయ్యాయి. భారత జట్టు 13(రైనా 5, సెహ్వాగ్ 4, యూసుఫ్ పఠాన్ 3, రోహిత్ శర్మ 1), న్యూజిలాండ్ 11(మకల్లమ్ 3, గుప్టిల్ 3, టేలర్ 3, ఓరమ్ 2).
Pages: -1- 2 News Posted: 25 February, 2009
|