తూర్పులో మహిళల పోటీ
ఈసారి నగరం అసెబ్లీ నియోజకవర్గం పి.గన్నవరంగా మారడంతో సిటింగ్ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి మళ్లీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అదే కాంగ్రెస్ టిక్కెట్ కోసం మేరి గ్రేస్ పోటీ పడుతున్నారు. ప్రజారాజ్యం టిక్కెట్ ను పెనుమళ్ల లక్ష్మి ఆశిస్తున్నారు. రాజోలు ఎస్సీ రిజర్వుడు స్థానం కోసం గేదెల వరలక్ష్మి, కోరుకొండ కృపావతి తెలుగుదేశం టిక్కెట్ కోసం, మట్టా శైలజ కాంగ్రెస్ టిక్కెట్ కోసం, భూపతి సుశీల ప్రజారాజ్యం టిక్కెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. రంపచోడవరం ఎస్టీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూ రమేష్(తెలుగుదేశం)నే మళ్లీ ఖరారు చేయగా, కాంగ్రెస్ టిక్కెట్ కోసం జి.సునీత, తేజస్వి కళ, పిఆర్పీ టిక్కెట్ కోసం ఎం.రామలక్ష్మి పోటీ పడుతున్నారు. కొత్తగా ఏర్పాటైన మండపేట నియోజకవర్గంలో మహిళా రాజ్యం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు టిక్కెట్ ను ఆశిస్తున్నారు.
రాజమండ్రి సిటీ సీటుకు తెలుగుదేశం టిక్కెట్ కోసం పార్టీ సీనియర్ నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె, నగర మేయర్ వీర రాఘవమ్మ కోడలు ఆదిరెడ్డి భవాని పోటీలో ఉన్నారు. రాజానగరం తెలుగుదేశం టిక్కెట్ కోసం పెందుర్తి అన్నపూర్ణ, ప్రజారాజ్యం టిక్కెట్ కోసం బదిరెడ్డి రోజా ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రి రూరల్ నుండి పోటీ చేయడానికి కాంగ్రెస్ టిక్కెట్ కోసం జక్కంపూడి విజయలక్ష్మి, కాకినాడ సిటీ ప్రజారాజ్యం టిక్కెట్ కోసం నాళం ఆండాళ్లు, ఉద్దండ రాజ్యలక్ష్మి, కాకినాడ రూరల్ పిఆర్పీ టిక్కెట్ కోసం అడ్డూరి లక్ష్మీశ్రీనివాస్, మాకినీడి శేషు కుమారి, తెలుగుదేశం టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, తుని ప్రజారాజ్యం టి్క్కెట్ కోసం రొంగలి లక్ష్మి, ప్రత్తిపాడు కాంగ్రెస్ టిక్కెట్ కోసం పర్వత సత్యవాణి, పిఠాపురం కాంగ్రెస్ టిక్కెట్ కోసం మునిసిపల్ ఛైర్ పర్సన్ దేవరాపల్లి రాజేశ్వరి ముమ్మిడివరం పిఆర్పీ టిక్కెట్ కోసం అబ్బిరెడ్డి మంగతాయారు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 25 February, 2009
|