ఢిల్లీపై ఎమ్మెల్యేల కన్ను
ఇప్పటి వరకూ ఎస్సీ రిజర్వుడు స్తానంగా వున్న నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం కూడా జనరల్ కేటగిరీకి మారడంతో దానిని తనకు కేటాయించాలని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డి పార్టీకి దరఖాస్తు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పీలేరు రామచంద్రా రెడ్డి రాజంపేట లోక్ సభ స్థానానికి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జి. కుతూహలమ్మ చిత్తూరు లోక్ సభ స్థానానికి పోటీ చేయాలనుకుంటున్నారు. అనంతపురం ఎంపి నియోజకవర్గం టిక్కెట్ ను మంత్రి జెసి దివాకర రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకర రెడ్డి కూడా ఆశిస్తున్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి ఈసారి నంద్యాల లోక్ సభ స్థానానికి, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే మల్లు రవి నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానానికి పోటీ చేయాలనుకుంటున్నారు. మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి కొత్తగా ఏర్పాటైన చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి, గీతా రెడ్డి వరంగల్ నుంచి, ఫరీదుద్దీన్ జహీరాబాద్ నుంచి, రెడ్యానాయక్ మహబూబాబాద్ నుంచి పోటీకి టిక్కెట్లు ఆశిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 25 February, 2009
|