'కాంగ్రెస్ కు కాంగ్రెసే శత్రువు'
'అయితే, రాష్ట్ర స్థాయి సమస్యలు, స్థానిక స్థాయి సమస్యలు ఉంటాయి. కాని ఈ ఎన్నికలు ఒక జాతీయ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికని, ఆ ప్రభుత్వానికి అఖిల భారత దృక్పథం ఉండాలని, మొత్తం దేశం సమస్యలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఉండాలని నొక్కిచెబుతూ మన ప్రచార వ్యూహాన్ని అమలు జరపాలి' అని సోనియా పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పట్టు సంపాదించుకోలేకపోతున్న ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలోని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సోనియా మాట్లాడుతూ, 'పరాజయ దృక్పథం వల్ల ప్రయోజనం కలగదు' అని అన్నారు. 2004 ఎన్నికలను గెలుచుకుని ఐదేళ్ళ కాలపరిమితిని పూర్తి చేయడం ద్వారా కాంగ్రెస్ ఏవిధంగా తన విమర్శకుల నోళ్ళు మూయించిందో ఆమె వివరించారు. ప్రజలకు భద్రమైన జీవితాన్ని సమకూర్చడానికి కట్టుబడి ఉంటూ, మతతత్వంపై పోరాడుతూ తన వాగ్దానాలను నెరవేర్చడానికి తిరిగి ప్రజల మద్దతును పార్టీ కోరాలని సోనియా ఉద్బోధించారు.
సంకీర్ణ భాగస్వామ్య పక్షాలకు, మద్దతు ఇస్తున్న పార్టీలకు సోనియా ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ కు అధికార బాధ్యతలు, హక్కుల గురించి గుర్తెరిగి వ్యవహరించిందని పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో సంక్లిష్ట క్షణాలు ఎదురైనప్పటికీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే పార్టీ దృఢసంకల్పమే ప్రభుత్వం నెగ్గుకురావడానికి దోహదం చేసిందని ఆమె అంగీకరించారు. గుండెకు బైపాస్ సర్జరీ అనంతరం కోలుకుంటున్న ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు.
Pages: -1- 2 News Posted: 26 February, 2009
|