కుదేలైన రియాల్టీ
న్యూఢిల్లీ: ఆర్ధిక సంక్షోభంతో రియాల్టీ ధరలు దాదాపు 10-40 శాతం క్షీణించాయి. ధరల తగ్గింపు, బహుమతులు వగైరా వ్యాపార చిట్కాలు రియాల్టీ ధరల పతనాన్ని ఆపలేకపోయాయి. రియాల్టర్లు డిమాండ్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ కీలక అపార్ట్ మెంట్ జోన్స్ లో ధరలు పడిపోయాయి. దేశ వ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో సైతం రియాల్టీ ధరలు క్షీణించాయి. ప్రాంతాన్ని బట్టి, పరిమాణాన్ని, మెరుగైన సదుపాయాల్ని బట్టి, ఆస్తిని పొందిన సమయాన్ని బట్టి రియల్ ఎస్టేట్ ధర నిర్ణయమైంది. గతంలో రియాల్టీ ధరలు కేవలం కాల్పనికంగా పెరిగాయి.
సంక్షోభం దెబ్బకు రియల్టీ ధరలు భూ మార్గం పట్టాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ ధరలను డెవలపర్స్ తగ్గించడం లేదు. అయితే అలాంటి ప్రభావాన్ని చూపే రిసేల్స్ మార్కెట్ ను వారు ఎదుర్కొంటున్నారు. దేశంలోని రెండవ అతిపెద్ద బిల్డర్ నోయిడా పొలిమేరల్లోను, గ్రేటర్ నోయిడాలోను చదరపు అడుగు 2,000-2,500 రూపాయల ఖరీదు చేసే కొత్త ప్రాజెక్టులకు రూపాకల్పన చేసింది. ఈ ప్రాంతంలోని ధరలు రెండేళ్లలో రెండితలయ్యాయి.మారుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రాజెక్టుల ధరలను రియాల్టర్లు సహేతుకంగా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. గురుగాంవ్ ప్రాంతంలో ఏడాది కాలంలో దాదాపు 8-12 శాతం రియాల్టీ ధరలు క్షీణించాయి. మరింత మారుమూల ప్రాంతాల్లో 20-35 శాతం ధరలు క్షీణించాయి.
Pages: 1 -2- News Posted: 26 February, 2009
|