కుదేలైన రియాల్టీ
సుషాంత్ లోక్ ఫేజ్ 2లో ఆరు నెలల క్రితం 30వేల రూపాయలుగా ఉన్న ఒక ప్లాటు చదరపు గజం ఖరీదు23 శాతం అంటే ప్రస్తుతం 23 వేల రూపాయలకు పడిపోయింది. పక్కాగా కొన్ని లావాదేవీలు మాత్రమే నడిచాయి. మిగిలిన ధరలన్ని కొనుగోలు దార్లు, అమ్మకం దార్లు మధ్య జరిగిన ఊహాగానాలు మాత్రమే. నిరుడు 5,000-6,000 రూపాయలుగా ఉన్న నోయిడా ప్లాట్లు ప్రస్తుతం 3,500-4,200 రూపాయల ధర పలుకుతున్నాయి. గ్రేటర్ నోయిడాలో నిరుడు 3,000-3,800 రూపాయలుగా ఉన్న ప్లాట్లు నేడు 2,000-2,800 రూపాయల ధరలు పలుకుతున్నాయి. మనేసర్ లాంటి ప్రాంతాలకు సమీపంలోని ప్లాట్లను డిఎల్ ఎఫ్ పిఎస్ఎఫ్ 2,200 రూపాయలకు అమ్మతోంది. చెన్నై రియాల్టీ ధరలు 10 శాతం పడిపోగా, బెంగళూరు రియల్టీ ధరలు 25 శాతం పతనమైనాయి.
ఉత్తర భారత దేశంలో కూడా ఇదే ధోరణి కొనసాగుతున్న విషయం డెవలపర్స్ కు స్పష్టంగా తెలియదు. ముంబై ప్రాంతంలో రియాల్టీ ధరలు మరో 10 శాతం పతనం కానున్నట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి. అదే సమయంలో ముంబై-పుణె మధ్య ప్రాంతంలో 6-9 నెలల కాలంలో 25-40 శతం రియాల్టీ ధరలు పతనమైనట్లు తెలుస్తోంది. పుణెలో పిఎస్ఎఫ్ 4వేల రూపాయలుగా ఉన్న ధరలు నేడు 2,200-3,000 రూపాయలకు దిగిపోయాయి. రియాల్టీ మార్కెట్ 2005-06 నాటి ధరల స్థాయికి దిగజారిందని పలువురు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నవి ముంబై రియాల్టీ ధరలు 2007లో రెండేళ్ల కాలంలో 70-100 శాతం పెరిగాయి. అయితే ఏడాది కాలంలో దాదాపు 20-30 శాతం పతనమైనాయి.
Pages: -1- 2 News Posted: 26 February, 2009
|