ట్వంటీ సిరీస్ విజేత కివీస్
భారత జట్టు ఇన్నింగ్స్ లో మహేంద్రసింగ్ ధోని బ్యాటింగులో పూర్తిగా విఫలమయ్యాడు. స్పిన్ బౌలింగులో కాని, పేసర్లను కాని అతడు కొట్టిన ఏ షాట్ కూ బంతికి బ్యాట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. అతడి తరువాత బ్యాటింగుకు వచ్చిన యువరాజ్ సింగ్ 13వ ఓవర్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని తిరిగి పెవిలియన్ కు చేరుకున్నాడు. కాని ధోని మాత్రం నాటౌట్ గా మిగిలి, 28 పరుగులే చేయగలిగాడు. మూడు వికెట్లు వరుసగా పడిపోయిన తరువాత రంగ ప్రవేశం చేసిన యువరాజ్ ఓబ్రియన్ ఓవర్లో సిక్సర్ కొట్టి అర్ధ సెంచరీ(34 బంతులు)పూర్తి చేశాడు. ఆ తరువాత యుసుఫ్ పఠాన్ పరుగులేమీ చేయకుండా వెట్టోరి బంతికి క్లీన్ బౌల్డ్ కాగా, 16 బంతులెదుర్కొని 19 పరుగులు చేసిన రవీంద్ర జడేజా ఔటయ్యాడు. అంతకుముందు మొదటి మ్యాచ్ హీరో సురేశ్ రైనా, ఓపెనర్ గౌతమ్ గంభీర్ వరుసగా ఔటయ్యారు. వీరేందర్ సెహ్వాగ్ చకచకా పరుగులు సాధించి భారత ఇన్నింగ్స్ కు మంచి ఆరంభాన్నిచ్చినా మిగతా బ్యాట్స్ మెన్ దానిని సక్రమంగా ఉపయోగించుకో లేకపోయారు. సెహ్వాగ్ 11 బంతుల్లో 24 పరుగులు చేశాడు.
భరత జట్టులో రోహిత్ శ్మరకు బదులు జడేజా ఆడాడు. న్యూజిలాండ్ జట్టులో మార్పు లేదు. మైదానంలో ఔట్ ఫీల్డ్ అద్భుతంగా ఉంది. ఈ సిరీస్ ను న్యూజిలాండ్ 2-0 స్కోరుతో గెలుపొందింది.
Pages: -1- 2 News Posted: 27 February, 2009
|