2007లో ఆసియా కప్ గెలిచిన తమ జట్టు ఏ ప్రత్యర్ధి జట్టునూ తక్కువగా అంచనా వేయదని ఝులన్ స్పష్టం చేసింది. 'వరల్డ్ కప్ నాలుగేళ్లకోసారి వస్తుంది. ప్రతి జట్టు బాగా రాణించడానికే ప్రయత్నిస్తుంది. క్రితంసారి మేము ఆడిన తరువాత నుంచి పాకిస్తాన్ జట్టు తమ నైపుణ్యాన్ని బాగా మెరుగుపరచుకుంది. అలాగే శ్రీలంక జట్టు కూడా. మా గ్రూపునుంచి సూపర్ సిక్స్ లోకి వెళ్లడం ఖాయం' ఆమె చెప్పింది.