ఆఫర్లు లేక ఐఐఎం డల్!
బెంగళూరు: ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) బెంగళూరులో ఇది ప్లేస్ మెంట్ ల కాలం. కాని ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం కొట్టవచ్చినట్లు కనిపించింది. శుక్రవారం రిక్రూట్ మెంట్ రోజు ఐఐఎం కాంపస్ లో ఒక విధమైన అనిశ్చితి నెలకొంది. క్రితం సంవత్సరం రిక్రూట్ మెంట్ల తొలి రోజే మెకిన్సీ, లీమాన్ బ్రదర్స్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వంటి సంస్థలలో రికార్డు స్థాయిలో 254 మంది విద్యార్థులలో 103 మంది ఉద్యోగాలు సంపాదించారు. ఈ సంవత్సరం గణాంకాలు ఇంకా వెల్లడి కాలేదు. కాని సంస్థ ప్రాంగణంలో 'మూడ్' ఏమాత్రం ఆశాజనకంగా లేదు. '
ఈ సంవత్సరం మూడ్ కొంత వరకు నిస్తేజంగా ఉంది' అని ఫ్యాకల్టీ సభ్యుడు ఒకరు తెలియజేశారు. 'ఇప్పటి వరకు ఎక్కువ డిమాండ్ లు ఉండేవి. ఇప్పుడు అకస్మాత్తగా పరిస్థితి మారిపోయింది' అని ఆయన చెప్పారు. కంపెనీలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేట్లు చూడడానికై మొట్టమొదటిసారిగా ఫ్యాకల్టీ సభ్యులు స్వయంగా రిక్రూటర్లను సంప్రదించారని ఆయన తెలిపారు. ఈ మాంద్యం విస్తారంగా ఉందని రిక్రూటర్లు చెప్పారు.
Pages: 1 -2- News Posted: 1 March, 2009
|