ఆఫర్లు లేక ఐఐఎం డల్!
'ఆఫర్ల సంఖ్య తగ్గింది' అని డైమండ్ మేనేజ్ మెంట్ అండ్ టెక్నాలజీ కన్సల్టెంట్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) వినోద్ నాయరు తెలియజేశారు. ఆయన సంస్థ ఈ సంవత్సరం ఐఐఎం కలకత్తా, బెంగళూరులను, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ ను సందర్శించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. 'మా ఎంపిక ప్రక్రియ నిరుటి మాదిరిగానే సాగింది' అని నాయర్ తెలిపారు. గతంతో పోలిస్తే హెచ్చు వేతనాలనే ఇవ్వజూపినట్లు ఆయన చెప్పారు.
కాగా, ఐఐఎం కలకత్తాలో మొదటి రౌండ్ ప్లేస్ మెంట్లు గత వారారంభంలో ముగిసాయి. 265 మంది విద్యార్థులలో దాదాపు 207 మందికి 74 సంస్థల నుంచి ఆఫర్లు వచ్చాయి. వారిలో కనీసం ఇద్దరికి ఏడాదికి దాదాపు కోటి రూపాయల వేతనాలను ఆఫర్ చేశారు. రెండవ దశ త్వరలో ప్రారంభం కావచ్చునని భావిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 1 March, 2009
|