పోస్టర్లపై రాహుల్ గరం!
సోనియా, మన్మోహన్ సింగ్ తమ తమ పరిధులు దాటకుండా కాంగ్రెస్ తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించగలిగారనే సందేశాన్ని జనానికి అందజేసేందుకై వారిద్దరి ఫోటోలను ఉపయోగించుకోనున్నట్లు పార్టీ వర్గాలు సూచించాయి. సోనియా-మన్మోహన్ కు, ఎల్.కె. అద్వానీకి మధ్య పోటీలో కాంగ్రెస్ ద్వయం వైపే 'మొగ్గు స్పష్టంగా ఉంది' అని వారు చెప్పారు. 'నాయకత్వం అంటే సహకారం, పరిణతి, నమ్మకాన్ని పాదుకొల్పడం గురించే తప్ప ఎవరు 'లోహ్ పురుష్' (ఉక్కు మనిషి), ఎవరు 'వికాస్ పురుష్' (అభివృద్ధి సాధించే మనిషి) గురించి కాదని వారిద్దరూ రుజువు చేశారు' అని పార్టీ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ) అధికారంలో ఉన్నప్పుడు అద్వానీ - వాజపేయి ద్వయంలో ఎవరిది పైచేయి అనే వాదన సాగుతుండేదని ఆ ప్రతినిధి పేర్కొన్నారు. కాగా, డాక్టర్ మన్మోహన్ సింగ్ గుండెకు బైపాస్ సర్జరీ అనంతరం కోలుకోవడానికి ఊహించినదానికన్నా ఎక్కువ సమయం తీసుకుంటున్నందున ఎన్నికలలో పోటీ చేయకపోవచ్చు. అయితే, సెమినార్ హాల్స్ లో 'మేధావులు, అభిప్రాయ నిర్ణేతల'ను ఉద్దేశించి ప్రసంగించే బదులు విస్తృత స్థాయిలో ప్రచారం సాగించవలసిందిగా డాక్టర్ సింగ్ ను కోరగలరని పార్టీ వర్గాలు తెలిపాయి.
Pages: -1- 2 News Posted: 1 March, 2009
|