బావ, మరుదుల రాజకీయం
ఇటీవల గుంటూరులో నిర్వహించిన తెలుగుదేశం యువగర్జన విజయవంతం కావడంతో పశ్చిమ గోదావరిలోని చౌదరీలందరూ దేశంవైపు మళ్లుతున్నారు. అదే సామాజికవర్గానికి చెందిన మాగంటి బాబును కూడా తెలుగుదేశంలో చేరాలంటూ ఆహ్వానిస్తున్నారు.ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ కూడా బాబుపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆయన అందుకు అంగీకరించ లేదు. కాంగ్రెస్ పొమ్మంటే తప్ప తాను పార్టీ మరేది లేదని స్పష్టంగా చేప్పారు. ఈ లోగా రాంబాబు కాంగ్రెస్ లో రాజకీయం నడిపి, బాబు పార్టీనుంచి నిష్క్రమిస్తే దెందులూరు సీటు తనకివ్వాలని ప్రతిపాదించారు.
ఈ దశలో కాంగ్రెస్ తో బాబుకు పూర్తిగా చెడింది. పార్టీ అధిష్టానం ఆయన్ను పట్టించుకోవడం మానేసింది. అప్పుడే బాబుకు తెలుగుదేశం అధినేత నుండి ఆహ్వానం అందింది. ఏలూరు సీటు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అందుకు ఆయన అంగీకరించారు. అయితే ఆయన బావమరిది రాంబాబు మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగాలని నిర్ణయించారు. దెందులూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలనుకుంటున్నారు. ఇక ముందు కథ రాజకీయ తెరపై చూడాల్సిందే.
Pages: -1- 2 News Posted: 1 March, 2009
|