దేశం టిక్కెట్లపై కీచులాటలు
హైదరాబాద్: టిక్కెట్ల పంపిణీ ఇంకా మొదలుకాక ముందే తెలుగుదేశం పార్టీలో కీచులాటలు ప్రారంభమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల ముఖ్య నాయకులు, సమన్వయ కమిటీల సభ్యులతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. చంద్రబాబు తనకు టిక్కెట్ ఖాయం చేశారని, నియోజకవర్గంంలో ప్రచారం చేసుకొమ్మన్నారని కొందరు నాయకులు ఆయా నియోజకవర్గాల్లో చేస్తున్న హడావిడి ప్రత్యర్ధులను ఇరకాటంలో పడేస్తోంది. ఏం చేయాలో తోచని ఆ ప్రత్యర్ధులు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయానికి వచ్చి వినతి పత్రాలతో చంద్రబాబును ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నింతాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
మెదక్ జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మంట్ కు సంబంధించిన సమీక్షను చంద్రబాబు ఇటీవల నిర్వహించారు.ఈ నియోజకవర్గం నుంచి టిక్కెట్ కోసం నలుగురు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. సాగునీటి పారుదల శాఖలో ఇంజనీర్ గా పనిచేస్తున్న నరోత్తమ్ తోపాటు రాజ్ కుమార్, రాములు టిక్కెట్ల వేటలో ఉన్నారు. అయితే నరోత్తమ్ పేరు ముందు ఖరారయిదని, జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం జరగడంకో, ఆ నియోజకవర్గానికి చెం దినవెయ్యిమంది పార్టీ కార్యకర్తలు ఆదివారం ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్ వచ్చి నరోత్తమ్ కు టిక్కెట్టి వ్వవద్దని చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశారు. మాజీ శాసనసభ్యుడు బాగన్న సారథ్యంలో వారంతా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లారు. నరోత్తమ్ కాంగ్రేస్ పార్టీ ఏజెంట్ అని పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడుకు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యాలయంలో కనిపించినవారందరికీ నరోత్తమ్ కు వ్యతిరేకంగా వినతి పత్రాలు అందజేశారు.
Pages: 1 -2- News Posted: 2 March, 2009
|