దేశం టిక్కెట్లపై కీచులాటలు
మహబూబ్ నగర్ జిల్లా గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డికె అరుణ సమీప బంధువు కృష్ణమోహన్ రెడ్డికి ఇవ్వవద్దంటూ నియోజకవర్గానికి చెందిన 27 మంది నాయకులు చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు.కాంగ్రెస్ పార్టీ ఒక పథం ప్రకారం భరతసింహా రెడ్డికి మేనల్లుడు అయిన కృష్ణమోహన్ రెడ్డిని తెలుగుదేశం అభ్యర్ధిగా నిలబెట్టి, తద్వారా ఈ నియోజకవర్గం నుంచి అరణను గెలిపించేందుకు కుట్ర జరుగుతోందని, ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు సీనియర్లు కూడా ఉన్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాల్మీకి కులస్తులు 60 వేలమంది ఉన్న ఈ నియోజకవర్గంలో టిక్కెట్ ను మాజీ ఎమ్మెల్యే గట్టి భీముడు లేదా ప్రముఖ న్యాయవాది జి.వెంకటాద్రి రెడ్డికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
Pages: -1- 2 News Posted: 2 March, 2009
|