550 ఐపిఎస్ పోస్టులు ఖాళీ
అయితే, 'అధీకృత సరాసరి రిక్రూట్ మెంట్ కోటాలో 1.5 శాతం'గా అభివర్ణించిన సూత్రాన్ని అనుసరించి వార్షిక రిక్రూట్ మెంట్ల సంఖ్యను 36గా అప్పటి ప్రభుత్వం నిర్థారించింది. రిటైర్ మెంట్ వంటి కారణాలతో ఏర్పడిన ఖాళీల గణాంకాలు సమగ్రమైనవి కావని, ప్రాథమికంగా లోపభూయిష్టమైనవని ఇప్పుడు యుపిఎ ప్రభుత్వం భావిస్తున్నది. కేంద్ర పారా మిలిటరీ దళాలు, కేంద్ర పోలీస్ సంస్థలతోసహా పోలీసు బలగాల విస్తరణకు ప్రయత్నమేమీ జరగలేదు కూడా.
2002లో వార్షిక ఐపిఎస్ రిక్రూట్ మెంట్ల సంఖ్యను 80కి పెంచారు.అయితే, యుపిఎస్ సి ఒక అభ్యంతరం లేవదీయడంతో కొత్తగా 56 పోస్టులను మాత్రమే ఆమోదించారు. 2003 జనవరిలో సరాసరి రిక్రూట్ మెంట్ కోటాలో మంజూరైన ఐపిఎస్ ఆఫీసర్ల సంఖ్య 2477 కాగా ఐపిఎస్ లో 190 మంది ఆఫీసర్లకు కొరత ఏర్పడింది. 2003లో అరవై మంది ఆఫీసర్లు రిటైరైనట్లు అంచనా. 1.5 శాతం సూత్రాన్ని వర్తింపచేస్తే, రిక్రూట్ చేసుకోవలసిన ఆఫీసర్ల సంఖ్య 97 కావాలి. అయినప్పటికీ అదే కారణంగా 2003, 2004 సంవత్సరాలలో ఆ సంఖ్యను 88గా నిర్థారించారని అధికార వర్గాలు తెలిపాయి.
2005లో ఐపిఎస్ లో రిక్రూట్ మెంట్ లో అంతరం 619కి పెరిగింది. వాటిలో 317 పోస్టులు సరాసరి రిక్రూట్ మెంట్ పోస్టులు. 1998, 2001 మధ్య 'కోర్టు ఉత్తర్వు పర్యవసానంగా' 36 మంది ఆఫీసర్లను మాత్రమే రిక్రూట్ చేసినట్లు ఈ దశలో ఆలస్యంగా గుర్తించారు. 2002-04 కాలంలో కేడర్ సమీక్షల పర్యవసానంగా కేడర్ సంఖ్యలో పెరుగుదల ఈ కొరతకు మరొక కారణంగా గుర్తించినట్లు హోమ్ మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. ఆ సమయంలో 268 పోస్టులు చేర్చారు.
Pages: -1- 2 -3- News Posted: 2 March, 2009
|