550 ఐపిఎస్ పోస్టులు ఖాళీ
దీనితో, ఈ సంఖ్యను 2006, 2007 సంవత్సరాలకు 103కు అప్పటి హోమ్ మంత్రి శివరాజ్ పాటిల్ సవరించారు. అయితే, సరాసరి రిక్రూట్ మెంట్ కోటాలో లోటు అప్పటికీ 325 మేర ఉంది. అందువల్ల ఆ సంఖ్ను 2008, 2009, 2010 సంవత్సరాలకు ఇంకా 130 మేరకు పెంచారు. 2009 జనవరి 1 నాటికి ఇండియాలో సరాసరి రిక్రూట్ మెంట్, పదోన్నతి ద్వారా మంజూరైన సంఖ్య 3889 కాగా 3332 మంది ఐపిఎస్ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు.
ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబి)లో ఐపిఎస్ ఆఫీసర్లతో భర్తీ చేయవలసిన ఎస్ పి స్థాయి, ఆ పై స్థాయిలో ఖాళీల సంఖ్య 88కి పెరిగింది. సిబిఐలో అటువంటి ఖాలీలు 27 ఉన్నాయి. ముంబైలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో గూఢచారి యంత్రాంగాన్ని మెరుగుపరచడానికి ప్రాముఖ్యం ఇస్తుండడంతో ఐబిలో ఖాళీల విషయం ఇప్పుడు తీవ్ర చర్చకు వస్తున్నది.
ఐబి, సిబిఐలలోని ఖాళీలలో చాలా వరకు ఎస్ పి, ఎస్ఎస్ పి స్థాయిలలో ఉండడం గమనార్హం. ఐబిలో ఎస్ పి, ఎస్ఎస్ పి స్థాయిలలో మంజూరైన సంఖ్య 82 కాగా, 58 ఖాళీలు ఉన్నాయి. సిబిఐలో అవే స్థాయిలలో మంజూరైన 49 పోస్టులకు 13 ఖాళీలు ఉన్నాయి. తదుపరి 10 సంవత్సరాలలో అవసరమయ్యే ఆఫీసర్ల సంఖ్య మదింపు కోసం కమల్ కుమార్ ను నియమించడం నార్త్ బ్లాక్ లో కానవస్తున్న ఆందోళనకు పర్యవసానమే.
Pages: -1- -2- 3 News Posted: 2 March, 2009
|