లక్ష మంది ఇంటిముఖం
వాషింగ్టన్: దాదాపు లక్ష మంది భారతీయులు వచ్చే 3-5 ఏళ్లలో స్వదేశానికి తిరిగి రాబోతున్నారు. అర్ధిక మాంద్యంలో విలవిల్లాడుతున్న అమెరికా పలు రక్షణ చర్యలను చేపట్టడంతో, లక్షలాది మంది భారతీయులకు ఉపాధి, పదోన్నతుల అవకాశాలు మూసుపోయాయి. దాంతో అమెరికా ప్రవాస భారతీయులు ఇంటిముఖం పట్టారు. అంతే సంఖ్యలో చైనా డయోస్పోరా కూడా చైనాకు వాపసు వెళ్లి పోతున్నారు. అమెరికా నుండి వెనుతిరిగి పోతున్న ప్రవాసాల రూపాంలోని శక్తి సామర్ధ్యాలు, సాంకేతిక నైపుణ్యాలు ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థలను మరింతగా అభివృద్ధి పరుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని, అదే సమయంలో ఈ పరిణామం అమెరికా సాంకేతికాభివృద్ధిని కుంటుపరుస్తుందని ఒక తాజా అధ్యయనం తెలిపింది.
వివేక్ వధ్వా సారధ్యంలోని డ్యూక్, హార్వార్డ్, బేర్కలీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. 'అమెరికా నష్టం ప్రపంచానికి లాభంగా పరిణమించనుంద'అని వివేక్ తెలిపారు. స్వదేశాలకు వాపసు వెళ్లే వారి సంఖ్య ఇదమిద్ధంగా తెలియదని ఆ పరిశోధక బృందం తెలిపింది. డ్యూక్ విశ్వవిద్యలయంలో ప్రాట్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ గా వాధ్వా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆయన హార్వార్డ్ లా స్కూల్ లో లేబర్ అండ్ వర్కఫైల్ ప్రోగ్రామ్ ఫెలో గా ఉన్నారు. ఈ స్వదేశి ఆగమనాలు ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థలకు ఊపునిస్తుంది. దాంతో అంతర్జాతీయంగా అవి గట్టిగా పోటీపడతాయని ఆ అధ్యయనం తెలియజేసింది.
'భారత దేశం ఇప్పటికే ప్రపంచ పరిశోధనల కూడలిగా మారింది.పలు కొత్త రంగాలకు విస్తరించేందుకు బారత్ కు అవకాశముంటుంది.ఈ అభివృద్ధి వీరి రాకతో మరింత వేగంగా పురోగమిస్తుంది. ప్రపంచంలోని మెరుగైన నిపుణలందరిని ఆకర్షించే శక్తి సామర్ధ్యాలు అమెరికాకు ఉండడంతో వలసల విషయంలో అమెరికా చాలా అహంభావంతో వ్యవహరిస్తోంది. అయితే అమెరికాతో సహా మరి కొన్ని దేశాలు కూడా మెరుగైన ప్రపంచ నిపుణులను అకర్షిస్తున్నాయి.'అని ఆ అధ్యయనం పేర్కొంది.
Pages: 1 -2- News Posted: 2 March, 2009
|