లక్ష మంది ఇంటిముఖం
'మన ఆర్ధిక ఉద్దీపనను మనమే ఎగుమతి చేస్తున్నాము. ఔట్ సోర్సింగ్ పై పన్ను పోటు విధించడంతో కొన్ని బ్యాంకులు విదేశీ ఉద్యోగులను తీసుకునే అవకాశాలు మూసుకపోయాయి. దాంతో ఈ చట్టం చేసిన వారు ఆశించిన దానికంటే భిన్నమైన ఫలితాలు సంభంవించే అవకాశముంది.వాళ్లు ఉద్యోగులను పంపించివేయడమే కాదు. మెరుగైన నిపుణులను జారవిడచుకుంటోంది.' అని వధ్వా అన్నారు. కన్సాస్ సిటీ కేంద్రంగా పనిచేసే ఈవింగ్ మారియన్ కౌఫ్ మన్ ఫౌండేషన్ సోమవారంనాడు ఈ అధ్యనాన్ని విడుదల చేసింది. అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని అదుపు చేసేందుకు విదేశీ ఉద్యోగులపై ఆంక్షలు పెట్టడం సరైన చర్య కాదు. సాంకేతిక పరిక్షాన అభివృద్ధిని ప్రస్తుత ఆంక్షలు దెబ్బతీస్తాయి.
'అత్యంత నైపుణ్యంగల ఉద్యోగులు గణనీయమైన సంఖ్యలో స్వదేశాలకు తరలిపోవడం అప్పుడే మొదలయ్యింది. మేథో వలస అత్యంత కీలకమైన ఒనరు. ఆర్ధిక పురోగతికి అత్యవసరమైన మేధో వలసను ప్రోత్సహించడం మాని వేస్తే వారు తమ దేశాలకు వాపసు వెళతారు. దాంతో మన వ్యాపారతత్వం, మన ఆర్ధిక ఉద్దీపన బెంగళూరు, బీజింగ్ లాంటి నగరాలకు తరలిపోతాయి'అని రీసెర్చ్ అండ్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ రాబర్ట్ ఈ లితాన్ తెలిపారు. హెచ్ 1బి వీసాలపై అమెరికా ఒబామా ప్రభుత్వం విధించిన ఆంక్షల వలన లక్షలాది మంది విదేశీ నిపుణులకు అమెరికా రావడానికి మార్గం మూసుకుపోయింది. వలసదారులు చాలా త్యాగాలకు పాల్పడుతున్నారు. వారు తమ బంధుమిత్రులను వదులుకుని రావడమే కాదు, దేశంలో రెండవ స్థాయి పౌరులుగా జీవిస్తున్నారు. అలాంటి వారిని వదులుకోవడం తెలివిమాలిన చర్యగా ఆ అధ్యయనం తెలిపింది. ప్రస్తుతం అమెరికా నుండి స్వదేశానికి తిరిగొచ్చే పలువురు ప్రవాసులకు భారత చైనా దేశాలు పలు రాయితీలు కల్పిస్తున్నాయి. స్వదేశీయులతో పాటు సమాన హోదాను కల్పిస్తున్నారు. దాంతో అత్యంత విద్యావంతులు, నిపుణులు స్వదేశాలకు తరలి వెళుతున్నారని ఆ అధ్యయనం తెలిపింది.
Pages: -1- 2 News Posted: 2 March, 2009
|