ఇక మూడు గుర్రాల రేసు!
మూడు ఫ్రంట్ లు చివరకు ఏ రూపుదాలుస్తాయో రానున్న రోజులలో తేటతెల్లం కాగలదు. అయితే, ఈ లైనప్ మాత్రం దాదాపుగా స్పష్టంగానే కనిపిస్తున్నది. మధ్యేవాదానికి (సెంటర్ కు) కొన్ని పాత, కొన్ని కొత్త భాగస్వామ్య పక్షాలతో కలసి కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్నది. శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్ సిపి, లాలూ ప్రసాద్ కు చెందిన ఆర్ జెడి, రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన ఎల్ జెపి, ఎం. కరుణానిధి నాయకత్వంలో డిఎంకె ప్రస్తుతం కాంగ్రెస సరసన ఉన్నాయి. బెంగాల్ లో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్, ఉత్తర ప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ కు చెందిన సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) తనకు మిత్ర పక్షాలు కాగలవని కాంగ్రెస్ ఆశిస్తున్నది.
ఇక మితవాదానికి (రైట్ కు) ఎన్ డిఎ భాగస్వామ్య పక్షాలతో కలసి బిజెపి ప్రాతినిధ్యం వహిస్తున్నది. బీహార్ లో జెడి (యు), ఒరిస్సాలో బిజెడి, మహారాష్ట్రలో శివసేన, పంజాబ్ లో అకాలీ దళ్ ఎన్ డిఎలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. బిజెపి మూడు కొత్త ప్రాంతీయ పక్షాలను, హర్యానాలో ఓమ్ ప్రకాశ్ చౌతాలాకు చెందిన ఐఎన్ఎల్ డిని, ఉత్తర ప్రదేశ్ లో అజిత్ సింగ్ కు చెందిన ఆర్ఎల్ డిని, అసోంలో ఎజిపిని మిత్ర పక్షాలుగా చేసుకున్నది.
ఇక అతివాదానికి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, లెఫ్ట్ ఫ్రంట్ లోని వాటి మిత్ర పక్షాలు ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్ పి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వాటికి తమిళనాడు జయలలిత నాయకత్వంలోని ఎఐఎడిఎంకె, ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టిడిపి, కె. చంద్రశేఖరరావు నాయకత్వంలోని టిఆర్ఎస్, కర్నాటకలో దేవెగౌడకు చెందిన జెడి (ఎస్) జత కలిశాయి. మాయావతి నాయకత్వంలోని బిఎస్ పిని అవి భావి మిత్ర పక్షంగా భావిస్తున్నాయి.
Pages: -1- 2 -3- News Posted: 3 March, 2009
|