ఇక మూడు గుర్రాల రేసు!
మాయావతి బిఎస్ పి తృతీయ ఫ్రంట్ లో లాంఛనంగా భాగస్వామ్య పక్షం కాకపోయినప్పటికీ తదుపరి ప్రభుత్వాన్ని ఈ ఫ్రంట్ ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే ఆ దళిత పార్టీ ఈ కూటమికి భవిష్యత్తులో మిత్ర పక్షం కావచ్చునని అనుకుంటున్నారు. కాంగ్రెసేతర, బిజెపియేతర ప్రత్యామ్నాయంగా తృతీయ ఫ్రంట్ రంగ ప్రవేశం వల్ల 2009 ఎన్నికల పోరు సంక్లిష్టం అవుతున్నది. ఇది 1989, 1996 ఎన్నికల నాటి పరిస్థితిని గుర్తు చేస్తున్నది. ఆ రెండు సందర్భాలలో మూడవ ఫ్రంట్ ఎంత త్వరగా ఉచ్ఛస్థితికి చేరుకున్నదో అంతే త్వరగా పతనమైంది. రెండు ప్రధాన జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన కిచిడీ ఫ్రంట్ అది. 1989 ఎన్నికలలో విపి సింగ్ నాయకత్వంలోని జనతా దళ్ అధికారంలోకి రాగా 1996లో యునైటెడ్ ఫ్రంట్ తెరపైకి వచ్చింది.
ఆ రెండు సందర్భాలలో కాంగ్రెస్ పార్టీయే ప్రధానంగా నష్టపోయింది. తృతీయ ఫ్రంట్ గా చెప్పుకున్న ప్రాంతీయ పార్టీల కూటమి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు సాంప్రదాయక వోటు బ్యాంకులైన దళిత, ముస్లింలను తన వైపు తిప్పుకున్నది. అయితే, బిజెపి కూడా దెబ్బ తినకపోలేదు. అది అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ప్రాంతీయ పార్టీలు సంఘటితమైనాయి. మరి చరిత్ర ఇప్పుడు పునరావృతమవుతుందా? లేక అస్థిరమైన, స్వల్ప కాల ప్రభుత్వాల చరిత్ర గల తృతీయ ఫ్రంట్ విశ్వసనీయతను కోల్పోయిన నిరర్థక శక్తిగానే మిగిలిపోతుందా? మే 16న వోట్ల లెక్కింపు మొదలైతే గాని ఇందుకు సమాధానాలు దొరకవు.
Pages: -1- -2- 3 News Posted: 3 March, 2009
|