అద్వానీపై ఓటర్ల డౌటు!
న్యూఢిల్లీ: దేశంలోని వోటర్లు ఆర్థిక సమస్యల పట్ల తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సర్వేలు సూచిస్తున్నాయి. అయితే, ఈ సమస్యలను అధిగమించేందుకు ఎల్.కె.అద్వానీ యుపిఎ బృందాన్ని మించిన సమర్థుడుగా వోటర్లు భావిస్తున్నట్లు ఈ సర్వేలు సూచించలేదు. 'బలహీనమైన' కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎండగట్టేందుకు ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ అద్వానీ నాయకత్వం బిజెపికి మొగ్గు తీసుకురాలేకపోయిందని పార్టీ వర్గాలు అంగీకరించాయి.
ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించేందుకు మన్మోహన్ సింగ్ - సోనియా గాంధి బృందానికే ఎక్కువ సామర్థ్యం ఉందని వోటర్లు విశ్వసిస్తున్నట్లు తెలుస్తున్నది. అద్వానీపై వోటర్లలో ఒక వర్గం వారికి వేరే విధంగా అభిమానం ఉంది. కాని ఆర్థికపరమైన అంచనాలేవీ ఆయన విషయంలో లేవు. అంతేకాకుండా అద్వానీ ఈ దఫా సైద్ధాంతిక అంశాలపై దృష్టి కేంద్రీకరించరాదని అనుకున్నారు. అటల్ బిహార్ వాజపేయికి వారసుడు కాదగిన మధ్యేవాద, పురోగామి దృక్పథం కల నాయకుడుగా తనను అద్వానీ చిత్రించుకుంటున్నారు.
ఈ మార్పు ఫలితాలను ఇవ్వదని, అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకత్వానికి ఎంతో మెరుగైన అర్హతలు ఉండడం ఇందుకు కారణమని బిజెపి నాయకులు కొందరు భావిస్తున్నారు. అద్వానీతో పోలిస్తే సోనియా - మన్మోహన్ - రాహుల్ త్రయమే సగటు వోటరు మదిలో ఎక్కువ చోటు సంపాదించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Pages: 1 -2- News Posted: 3 March, 2009
|