అద్వానీపై ఓటర్ల డౌటు!
వ్యక్తిగతంగా మన్మోహన్ కన్నా అద్వానీ ముందంజలో ఉన్నట్లు బిజెపి సర్వేలు సూచిస్తున్నప్పటికీ కాంగ్రెస్ త్రయం సమష్ఠి ఆకర్షణ అద్వానీ ఆకర్షణను మించిపోతున్నదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అర్థ గణాంక వివరాలను ఉటంకిస్తూ కాంగ్రెస్ ను బిజెపి ఓడించజాలదని, భావోద్వేగపరమైన అంశాలు మాత్రమే పార్టీకి మొగ్గును తీసుకురాగలవని బిజెపి నాయకులు అనేక మంది అభిప్రాయపడుతున్నారు. వృద్ధి రేటును పెంచడంలోను, సాంఘిక రంగంలోను ఎన్.డి.ఎ కన్నా తామే ఎక్కువ విజయవంతమైనట్లు ప్రభుత్వం చిత్రించుకోగలదని బిజెపి గ్రహించింది. ఉగ్రవాదంపై కూడా వోటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో యుపిఎ ప్రభుత్వ రికార్డు అత్యంత నాసిగా ఉన్నందున బిజెపిలో ఇది కొంత వరకు ఆశలు రేకెత్తిస్తున్నది.
ముంబైలో దాడుల అనంతరం ఆంతరంగిక భద్రత లేమి ప్రధానంగా ఆందోళన కలిగిస్తున్నదదని అధిక సంఖ్యాక ప్రజలు భావిస్తున్నారని బిజెపి విశ్వసిస్తున్నది. ఆర్థిక మాంద్యం, ఉగ్రవాద దాడులు రెండూ వోటర్లలో అభద్రత భావనను పాదుకొల్పలగవు కనుక 'భద్రత లేని ఇండియా, భద్రత లేని పౌరులు' అనే అంశం ప్రాతిపదికగా తన ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవాలని బిజెపి నిర్ణయించుకున్నది. వోటర్లు అంతగా పట్టించుకోకపోయినా బిజెపి ప్రచారంలో ప్రాధాన్యతాంశంగా ఉన్న మరొక అంశం కాంగ్రెస్ ఆనువంశిక సంప్రదాయం. పట్టణ ప్రాంతాలలోని మేధావులు, విద్యాధిక యువతలో అత్యధిక సంఖ్యాకులు ఈ విషయాన్ని పట్టించుకోగలరని బిజెపి భావిస్తున్నది.
వంశపారంపర్య అంశంపై దృష్టిని కేంద్రీకరించడం వల్ల కాంగ్రెస్ వ్యతిరేక భావాన్ని పటిష్ఠం చేయవచ్చునని, దీనితో ప్రాంతీయ పార్టీలు అనేకం ఎన్ డిఎ వైపు మొగ్గు చూపగలవని బిజెపి విశ్వసిస్తున్నది. రాహుల్ కు వ్యతిరేంగా అద్వానీ గురించి ప్రచారం చేయడానికై బిజెపి 'కర్మయోగి వర్సస్ వంశయోగి' అనే నినాదాన్ని సృష్టించింది. మన్మోహన్ ను ఎదుర్కొనడానికై 'మజ్ బూర్ (నిస్సహాయుడైన) పిఎంకు మజ్ బూత్ (బలమైన) పిఎంకు మధ్య పోటీ' అనే నినాదాన్ని బిజెపి చేపట్టింది. బిజెపి కేంద్ర నాయకత్వం గత ఐదు సంవత్సరాలుగా ఇదే అంశాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తున్నది.
Pages: -1- 2 News Posted: 3 March, 2009
|