కెప్టెన్ ధోని 89 బంతుల్లో 84(నాటౌట్)పరుగులు చేయడంతో భారత జట్టు 38 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 273 పరుగుల భారీ స్కోరు సాధించింది. ధోని టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకున్నాడు. 4.3 ఓవర్లు పూర్తయ్యేసరికి వాన మొదలయింది. వాన వెలిసిన తరువాత క్ వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం ఒక్కో జట్టు బ్యాటింగుకు 38 ఓవర్లు కేటాయించారు. అప్పుడు మొదలయింది సెహ్వాగ్ పరుగుల వర్షం. 56 బంతుల్లో 77 పరుగులు చేసిన సెహ్వాగ్ కివీస్ ఫీల్డర్లను మైదానం నలుమూలలకు పరుగులు పెట్టించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 20 పరుగులకు ఔటయ్యాడు. యూసుఫ్ పఠాన్ పది బంతుల్లో 21(నాటౌట్)మెరుపులు మెరిపించాడు. మహేంద్ర సింగ్ ధోని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు