'ఐపిఎల్ వాయిదా వేయం'
ఇందుకు బదులుగా హోం శాఖ మరింత కఠిన వైఖరిని ప్రదర్శించింది. 'ఐపిఎల్ ఆర్గనైజర్లు సెక్యూరిటీ కోరితే తిరస్కరిస్తాం' అని స్పష్టం చేసింది. ఐపిఎల్ మ్యాచ్లు ఈ యేడాది కొత్తగా నిర్ధారించిన విశాఖపట్నంతో సహా తొమ్మిది చోట్ల జరుగుతాయి. గత సంవత్సరం పోటీలు జరుగుతుండగా జైపూర్ లో వరుస బాంబు దాడులు భయోత్పాతం సృష్టించాయి. ఆ తరువాత బెంగుళూరు, న్యూఢిల్లీ, ముంబాయిలలో టెర్రరిస్టు దాడులు జరిగాయి. ఈ యేడాది ఐదు దశల్లో జరుగనున్న ఎనికల భదర్తా ఏర్పాట్ల కోసం హోం శాఖ 550 కంపెనీల(65,000 ట్రూపులు) సిబ్బందిని కేటాయించింది. క్రితం సారి ఎన్నికలలో 750 కంపెనీల భద్రతా దళాలు విధులు నిర్వహించాయి. అంతే కాకుండా పారా మిలిటరీ దళాల్లో అధిక శాతం ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో నక్సలైట్, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయని హోం శాఖ ్ధికారులు వివరించారు. గత సంవత్సరం ముంబాయి దాడులు, నిన్నటి లాహోర్ దాడుల నేపథ్యంలో ఎన్నికలకు ఎటువంటి లోటుపాట్లు లేని భద్రతా ఏర్పాట్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈడెన్ గార్డెన్స్ వంటి పెద్ద స్టేడియంలో గత సంవత్సరం ఒక్కో మ్యాచ్ కు 5,000 మంది వంతున పోలీసు సిబ్బందిని నియమించారు. ఈసారి భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచవలసిన అవసరం ఉందని కలకత్తా పోలీసు కమిషనర్ జావేద్ షమీమ్ చెప్పారు. అంతే కాకుండా టోర్నమెంట్ భద్రతా ఏర్పాట్లను, షెడ్యూలును సమీక్షించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పటికే సమస్యలతో సతమతం అవుతున్న లలిత్ మోడికి మరో ఎదురుదెబ్బ అని ఐపిఎల్, బిసిసిఐ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన మోడి, అంతకుముందు తనకు ఆప్తురాలైన ముఖ్యమంత్రి వసుంధర రాజె పదవి కోల్పోయిన దగ్గర్నుంచి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 4 March, 2009
|