'ఐపిఎల్ వాయిదా వేయం'
మంగళవారం లాహోర్ దాడుల తరువాత తమకు ఫోన్లు చేసిన ఇంగ్లీషు, ఆస్ట్రేలియా క్రికెటర్ల ఏజెంట్లకు భద్రతా ఏర్పాట్లు లోపరహితంగా ఉంటాయని హామీ ఇచ్చామని ఐపిఎల్ వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం రాజస్థాన్ రాయల్స్ జట్టు భద్రతా వ్యవహారాల ఇన్ ఛార్జిగా వున్న దక్షిణాఫ్రికా సంస్థ నికోల్స్ స్టీన్ అండ్ అసోసియేట్స్ కు ఈ యేడాది ఆటగాళ్ల భద్రత బాధ్యత అప్పగించారు. ఆ సంస్థ సిబ్బందిలో ఒకరైన ఫైసుల్ నాజెల్ 26/11 ముంబాయి దాడుల సమయంలో తాజ్ పేలస్ హోటల్ లో ఉన్నారు. దాదాపు 120 మందిని ఆయన సురక్షిత ప్రదేశమైన వంటగదిలోకి చేర్చారు. తమ జట్లలో వున్న శ్రీలంక ఆటగాళ్లతో మాట్లాడామని కొల్ కటా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తదితర ఐపిఎల్ ఫ్రాంచైజీలు తెలిపాయి. లాహోర్ దాడిలా గాయపడిన అజంత మెండిస్ కోల్ కటా జట్టులో, కుమార్ సంగక్కర కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టులో సభ్యులు.
Pages: -1- -2- 3 News Posted: 4 March, 2009
|