తమ్మూళ్ళూ వెనక్కి రండి!
హైదరాబాద్: రకరకాల కారణాలతో పార్టీని వదిలి వెళ్ళిపోయిన తమ్ముళ్ళందరినీ తిరిగి అక్కున చేర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు తర్వాత అంతగా ఒక వెలుగు వెలిగిన దేవేందర్ గౌడ్ ను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలియవచ్చింది. గౌడ్‌తోపాటు పెద్దిరెడ్డిని కూడా తిరిగి పార్టీలోకి తీసుకోవాలని టీడీపీ నిర్ణయించింది.
ఇక్కడ జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే పార్టీ వీడి వెళ్లిన సీనియర్ నాయకులు కళా వెంకట్రావు, తమ్మినేని సీతారాం, భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతును కూడా తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలన్న విషయంపై పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించినట్లు సమాచారం. 1985 నుంచి టీడీపీలో పని చేస్తున్న కార్యకర్తలు, నాయకులు కొందరు బయటకు పోయారని వారిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని నిర్ణయించిన్నట్లు పొలిట్ బ్యూరో సభ్యులు ఒకరు తెలిపారు
Pages: 1 -2- News Posted: 4 March, 2009
|