తమ్మూళ్ళూ వెనక్కి రండి!
15లోగా వామపక్షాలతో సీట్లు సర్దుబాటు ఖరారు కాని పక్షంలో ఆ తర్వాత మహాకూటమితో సంబంధం లేకుండానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయాలనే ఆలోచన కూడా పొలిట్‌బ్యూరోలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో ఉన్న సీట్లు అన్ని కూడా వామపక్షలకు, టిఆర్‌ఎస్‌కు ఇవ్వడం వల్ల ఇక టీడీపికి సీట్లు మిగలవని, ఒక వేళ అన్ని సీట్లు వారికిచ్చినా అక్కడ కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుం దని, కాబట్టి కామ్రేడ్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి సంసిద్ధంగా ఉండకూడదని అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.
నిధుల కోసం మల్లగుల్లాలు
ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా తెలంగుదేశం పార్టీ తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. రానున్న ఎన్నికలలో అయ్యే ఖర్చుకు టీడీపీ వెనకాడుతున్నట్లు తెలియవచ్చింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే ఆ పార్టీ చేపట్టిన ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలని, అందుకోసం డబ్బు సమకూర్చుకోవాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రజల నుంచి విరాళాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నది. దీనిని పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధుల ప్రచారం కోసం ఖర్చు పెట్టాలని పొలిట్‌బ్యూరో భావిస్తోంది.
అలాగే నిధుల సేకరణ కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆన్ లైన్ డొనేషన్ల కోసం వెబ్ సైట్ ను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇప్పటికే తమ వంతు విరాళాలాను ఆన్ లైన్ ద్వారా పార్టీకి పంపుతున్నట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు ఒకరు చెప్పారు. ఆన్ లైన్ డొనేషన్ పై ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడం ద్వారా నిధులను మరింత ఎక్కువగా సమీకంరించుకోవచ్చునని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు సూచించారు.
Pages: -1- 2 News Posted: 4 March, 2009
|