'శంకర్ దాదా'కు డూప్ లు!
హైదరాబాద్: పుట్టుకతోనే పెను ముప్పులు ఎదుర్కొంటూ వస్తున్న ప్రజారాజ్యం పార్టీకి మరో కొత్త చిక్కు ఎదురుకాబోతోంది. పార్టీ పేరు నమోదు విషయంలోను, ఉమ్మడి గుర్తు విషయంలోను వివాదంలో చిక్కుకున్న ఈ పార్టీ అభ్యర్ధులు స్వతంత్రులుగానే బరిలో దిగాల్సిన పరిస్థితి ఎదురాబోతోంది. దీనికితోడు చిరంజీవిపై పలువురు ఇండిపెండెంట్లను పోటీకి నిలబెట్టాలని, వారి పేర్లు కూడా ఆయన పేరే(శివ శంకర వరప్రసాద్)అయ్యేలా చూడాలని ప్రత్యర్ధులు వ్యూహ రచన సాగిస్తుండడం ప్రజారాజ్యానికి మింగుడుపడడం లేదు. తాను తిరుపతి నుంచి పోటీ చేయనున్నట్టు చిరంజీవి ప్రకటించడంతో మిగతా పార్టీలు కూడా తిరుపతిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. చిరంజీవి ఆయన సొంత పేరు కాదు. ఎన్నికల్లో సొంత పేరుమీదే పోటీ చేయాలి. ప్రభుత్వం ముద్రింపజేసే బ్యాలెట్ లో సొంత పేరు ముద్రించి, కావలిస్తే దాని పక్కన బ్రాకెట్ లో నిక్ నేమ్(చిరంజీవి) కూడా ప్రచురిస్తారు.
ఇక చిరంజీవిని స్వతంత్ర అభ్యర్ధిగా మాత్రమే పరిగణిస్తారు కాబట్టి, ఆయనకు ప్రత్యేకమైన గుర్తును ఇచ్తే అవకాశాలు లేవు. దీనిని ఆసరాగా చేసుకుని కొణిదెల శివ శంకర్ ప్రసాద్ పేరుకు దగ్గరా పేర్లు గల అభ్యర్ధుల వేటలో మిగతా పార్టీలు పడ్డాయి. ఇలాంటి పేర్లు గల అభ్యర్ధులు నిక్ నేమ్ గా, బ్రాకెట్ లో చిరంజీవి లేదా ఏ ఇతర పేరునైనా ఉపయోగించుకోవచ్చు. అందువల్ల చిరంజీవి అసలు పేరుకు దగ్గరగా ఉండే పేర్లు గలవారిని పోటీలోకి దింపి, పక్కనే బ్రాకెట్ లో చిరంజీవి అని ప్రచురిస్తే ఓటర్లు అయోమయానికి గురవుతారని వారు యోచిస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికే గుర్తు మారే అవకాశాలు ఉండడంతో చిరంజీవి గుర్తుకు కూడా పెద్దగా ప్రాచుర్యం కనిపింలేదు. దీంతో అదే గుర్తుకు దగ్గరా వున్న ఇతర గుర్తులను తమ అభ్యర్ధులకు వినియోగించుకుని ప్రజారాజ్యం నాయకుడి ఓట్లు చీల్చాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది.
Pages: 1 -2- News Posted: 5 March, 2009
|