'శంకర్'కు డూప్ ల ముప్పు!
తిరుపతిలో ఇలాంటి పరిస్థితిసృష్టించడం ద్వారా తిరంజీవి దృష్టి పూర్తిగా ఈ ఒక్క నియోజకవర్గంపైనే కేంద్రీకరించే విధంగా ఒత్తిడి తెచ్చి, మిగిలిన ప్రాంతాల్లో తాము లాభపడాలని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్నికల కమిషన్ ఇలాంటి చిక్కులు కలిగించలేదు. ఎన్టీఆర్ దరఖాస్తు చేసుకున్న మేరకు వెంటనే ఆ పార్టీకి సైకిల్ గుర్తును కేటాయించారు. అలాగే ప్రజాస్వామ్య తెలుగుదేశంకు ఉదయిస్తున్న సూర్యుడు, ఎన్టీఆర్ తెలుగుదేశానికి సింహం, అన్న తెలుగుదేశం పార్టీకి గంట గుర్తులను కేటాయించారు. ఇటీవలే ప్రారంభించిన టిఆరెస్ కు కూడా కారు గుర్తును ెన్నికల కమిషన్ మంజూరు చేసింది. ఓక్క చిరంజీవికి మాత్రమే ఈ పరిస్థితి ఎదురవుతోంది.
Pages: -1- 2 News Posted: 5 March, 2009
|