విప్రోలో వేలాది జాబ్స్ కట్
బెంగళూరు: భారత ఐటి సంస్థలు నెమ్మదిగా తమ సైజును సర్దుబాటు చేసుకుంటున్నాయి. తిన్నగా ఉద్యోగులకు ఉద్వాసన చెబుతున్నాయి. గతంలో బెంచ్ స్టాఫ్ ను వదలించుకున్న ఐటి దిగ్గజాలు ప్రస్తుతం నిర్వహణ సామర్ధ్యాన్ని పెంపొందించే పేరుతో మరికొందరు ఉద్యోగులను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. నైపుణ్యంలేని ఉద్యోగులను తొలగించే పాత విధానాన్నిప్రస్తుతం సంస్థ నిర్వహణ సామర్ద్యాన్ని పెంపొందించే చర్యలని పిలుస్తున్నాయి. ఆ దారిలోనే విప్రో టెక్నాలజీస్ సంస్థ దాదాపు 5 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది.
జనవరి-మార్చి త్రైమాసికంలో విప్రో గ్లోబల్ ఐటి సర్వీసెస్ డివిజన్ లో పనిచేసే సిబ్బందిలో దాదాపు 7-8 శాతం ఉద్యోగులు ఇంటి దారి పట్టవలసి ఉంటుంది. సాధారణంగా కేవలం 0.5 శాతం ఉద్యోగుల్ని మాత్రమే సామర్ధ్యం పేరుతో విప్రో తొలగించేది. గత రెండు త్రైమాసికాల్లో ఈ తొలగింపులు 2 శాతానికి చేరుకున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో 7 శాతం ఉద్యోగులను తొలగించేందుకు విప్రో సిద్ధపడింది. విప్రో ఐటి డివిజన్ ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ మార్కెట్లకు ఐటి సేవలను అందిస్తుంది. ఈ డివిజన్ లో డిసెంబర్ చివరినాటికి దాదాపు 60,605 మంది పనిచేస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 5 March, 2009
|