విప్రోలో జాబ్స్ కట్
ఆర్ధిక సంక్షోభం కారణంగా అంతర్జాతీయ ఐటి కాంట్రాక్టులు మందగించడంతో గ్లోబల్ ఐటి డివిజన్ లో 5 వేల మంది ఉద్యోగులను విప్రో తొలగించనుంది. విప్రో తొలగిస్తున్న ఉద్యోగుల్లో ప్రధానంగా కొత్తగా చేరినవారే. సిబ్బందిలో మూడు నుండి అయిదేళ్ల లోపు అనుభవమున్న వారిని సైతం విప్రో తొలగిస్తోంది. కంపెనీ నుండి ఏడాదికి 12 లక్షల రూపాయల పారితోషికాన్నిపొందుతున్న విపిలు, జనరల్ మేనేజర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లను కొంతమందిని సైతం విప్రో తొలగిస్తోంది. గతంలో సీనియర్ సిబ్బందికి ఇలాంటి తొలగింపు ప్రమాదముండేది కాదు. ఎక్కువ మొత్తంలో జీతాలను తీసుకునే వారిని ముఖ్యంగా ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లు కొందరి అభిప్రాయం.
దాదాపు దశాబ్ద కాలంగా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులు తమ అర్హతలను నిరూపించుకోవలసి ఉంటుంది. అందుకు కంపెనీ వారికి రెండు మూడు నెలల గడువు ఇస్తోంది. వారు తమ సామర్ద్యాన్ని నిరూపించుకోలేని పక్షంలో కంపెనీ నుండి వెళ్లిపోవలసి ఉంటుంది. ఇందుకోసం జూనియర్ స్టాఫ్ కు అన్నిరకాల శిక్షణ నివ్వడంపై విప్రో కేంద్రీకరిస్తోంది.జనవరి నుండి విప్రో సిబ్బంది మొత్తం సర్టిఫికేషన్ పరీక్షల్ని ఎదుర్కోవలసి వస్తోంది. సీనియర్ మేనేజ్ మెంట్ కు మాత్రం ఇందులో మినహాయింపు ఉంది. ఈ పరీక్షల్లో 70 శాతం సాధించలేని వారికి కంపెనీ మూడు అవకాశాలను ఇస్తోంది. మూడు అవకాశాల్లోను వారు సాధించలేక పోతే ఇంటి దారి పట్టక తప్పదు. అమెరికా, యూరోప్ కు చెందిన పలు ఫైనాన్స్ రంగానికి చెందిన ప్రాజెక్ట్ టీమ్స్ లో సగానికి పైగా సిబ్బంది ఉద్యోగాల్ని కోల్పోయారు.
Pages: -1- 2 News Posted: 5 March, 2009
|