డాక్టరేట్లు మీ ఇష్టమేనా?
అయితే, కనీసం రాష్ట్రపతి ఆమోదం కోరకుండానే జమియా నిరుడు అక్టోబర్ 31న స్నాతకోత్సవంలో ఆ డిగ్రీలను ప్రదానం చేసింది. షబానా, నసీరుద్దీన్ లతో పాటు , విశ్వవిద్యాలయం కళా పండితుడు కపిల వాత్సాయన్ కు, ముస్లిం పండితుడు అస్ఘర్ అలీ ఇంజనీర్ కు కూడా గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. వాటికి ఆమోదముద్రను జమియా జనవరిలో మాత్రమే కోరిందని రాష్ట్రపతి కార్యాలయం తన నోట్ లో తెలియజేసింది.
అవార్డు గ్రహీతలు ఆ గౌరవ పురస్కారాలను వాపసు చేయవలసిందిగా తాము కోరవలసిన పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలని హెచ్ఆర్ డి మంత్రిత్వశాఖ, జమియా అనుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. 'అది నలుగురిలో నగుబాటు కాగలదు. ఆ కళంకాన్ని చెరిపివేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టుతుంది' అని జమియా అధికారి ఒకరు పేర్కొన్నారు. కాని రాష్ట్రపతి వెలిబుచ్చిన ఆందోళనను కూడా వారు బేఖాతరు చేయజాలరు కదా!
నిబంధనల ఉల్లంఘనను జమియా 'యాదృచ్ఛికంగా చేసిన తప్పిదం'గా పేర్కొంటూ రాష్ట్రపతి కార్యాలయానికి లేఖ రాయాలని హెచ్ఆర్ డి మంత్రిత్వశాఖ యోచిస్తున్నదని ఆ వర్గాలు తెలిపాయి. జమియాను క్షమించవలసిందని, ఆ డిగ్రీలను గుర్తించవలసిందని రాష్ట్రపతికి మంత్రిత్వశాఖ విజ్ఞప్తి చేయగలదని ఆ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి గుర్తించకపోతే ఆ డిగ్రీలు చెల్లవని అధికారులు అంగీకరిస్తున్నారు. కేంద్ర విశ్వవిద్యాలయాలు, చివరకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)లతో సహా ఉన్నత శ్రేణి విద్యా సంస్థలు తమ తమ స్నాతకోత్సవాలలో గౌరవ డిగ్రీలు ప్రదానం చేయడానికి బారులు తీరడం అంతకంతకు ఎక్కువవుతున్నదని మంత్రిత్వశాఖ అధికారులు చెప్పారు.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ 30కి పైగా గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. బహుశా అటువంటి డిగ్రీలు అత్యధిక సంఖ్యలో స్వీకరించిన భారతీయుల జాబితాలో ఆయనే ప్రథమ స్థానంలో ఉండవచ్చు. ఇక గౌరవ డిగ్రీల కోసం అణు ఇంధన సంస్థ (ఎఇసి) అధిపతి అనిల్ కాకోద్కర్ పాపులారిటీ భారత-అమెరికా అణు ఒప్పందం అనంతరం పరాకాష్టకు చేరింది. కనీసం రెండు ఐఐటిలు ముంబై, ఖరగ్ పూర్ సంస్థలు పారిశ్రామికవేత్త రతన్ టాటాకు గౌరవ డిగ్రీలు ప్రదానం చేశాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం తన పూర్వ విద్యార్థి నటుడు అమితాభ్ బచ్చన్ కు 2006లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
Pages: -1- 2 News Posted: 6 March, 2009
|