ధీమా ఉంటేనే రండి: షారుఖ్
'ఇస్ బార్ బారీ టీమ్స్ కే లియే మేరా ఏక్ హాథ్ హీ కాఫీ హై' అని ఎస్ఆర్ కె రెండు వారాల క్రితం తన భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఎడమ చేతికి కట్టుతో ఉన్న షారుఖ్ 'షోలే' చిత్రంలో ఠాకూర్ వలె జోక్ చేశారు. 'నేను అక్కడ ఉంటాను. రెండు చేతులతోనూ చప్పట్లు కొడతాను... చప్పట్లు కొట్టేందుకు నాకు అవకాశం లభిస్తుందనే ఆశిస్తున్నాను' అని షారుఖ్ గురువారం మధ్యాహ్నం ' ది టెలిగ్రాఫ్' పత్రిక విలేఖరితో అన్నారు. సర్జరీ అనంతరం మొదటిసారిగా షూటింగ్ కోసం తన నివాసం మన్నత్ నుంచి యశ్ రాజ్ స్టూడియోకు వెళుతూ షారుఖ్ పత్రిక విలేఖరితో మాట్లాడారు.
గత సీజన్ లో షారుఖ్ జట్టు సెమీ ఫైనల్స్ కు చేరుకోలేకపోయింది. అది ఆయనను బాధించింది. 'ఓటమి ఎప్పుడూ బాధాకరమే' అని ఆయన అన్నారు. అయితే, బాలీవుడ్ లో తాను గడిపిన సుమారు 20 సంవత్సరాల అనుభవం నుంచి తాను నేర్చుకున్న పాఠాన్ని తన జట్టు సభ్యులకు నేర్పాలని షారుఖ్ ఆశిస్తున్నారు. 'ఇది నాకౌట్ పంచ్ గురించి కాదు. 12 రౌండ్లు ముగిసే వరకు నిలదొక్కుకోవడం గురించి' అనేదే షారుఖ్ నేర్చుకున్న పాఠం.
Pages: -1- 2 -3- News Posted: 6 March, 2009
|