ధీమా ఉంటేనే రండి: షారుఖ్
'నేను రంగ ప్రవేశం చేసినప్పుడు నేను మైక్ టైసన్ వలె ఉన్నాను. కాని, ఇప్పుడు అయితే మహమ్మద్ అలీగా కావాలి లేదా జార్జి ఫోర్మన్ అవ్వాలి అని గ్రహించాను. (బాక్సర్) జేక్ లామోట్టా అన్నట్లుగా నన్ను ఎప్పుడూ పడగొట్టలేరు. మీరు ఓడిపోవచ్చు. కాని పరాజితుడుగా ఉండకండి. నా కెరీర్ లో వాకు విజయాల కన్నా పరాజయాలే ఎక్కువగా ఉన్నాయి. కాని ఈనాడు జనం షారుఖ్ ఖాన్ ను విజేతగా పేర్కొంటున్నారు. ఎందుకంటే నేను ఢక్కామొక్కీలు తిన్నాను. నైట్ రైడర్స్ క్రీడాకారులలో ఇదే భావాన్ని పాదుకొల్పాలని నేను ఆకాంక్షిస్తున్నాను' అని షారుఖ్ చెప్పారు.
బుజ్జగింపు మాటలు పని చేయకపోతే ఎస్ఆర్ కె మరొక వ్యూహాన్ని అనుసరించబోతున్నారు. 'ఈ దఫా నేను ఒక పెద్ద నల్ల గంటను పట్టుకోబోతున్నాను. ఈడెన్ గార్డెన్స్ లో పోటీల సమయంలో ఈ గంట కొట్టాలని అనుకుంటున్నాను. ఆ భారీ ఘంటానాదాల వలె ఇది మోగుతుంది. నేను దుర్గా పూజ పండుగ సమయంలోను, ఇతర చోట్ల గంటలను చూసినప్పుడు మైదానంలో ఆ సవ్వడి తీసుకురావాలని అనుకుంటున్నాను. నేను ఇతర ప్రాంతం నుంచి వచ్చినవాడినని మీరు అనుకోవచ్చు. కాని నేను కలకత్తాలో ఇతర ప్రాంతంవాడిని కాను. జైపూర్, ఢిల్లీ అవకాశాలు నాకు లభించాయి. కాని నేను నా ఐపిఎల్ జట్టుగా కలకత్తానే ఎప్పుడూ కోరుకున్నాను' అని ఆయన వివరించారు.
రీమిక్స్ చేసిన టీమ్ గీతం ఐపిఎల్ తొలి సీజన్ లోని 'కోర్బో లోర్బో జీత్బో రె' గీతం కన్నా ఎక్కువ పాపులర్ కాగలదని షారుఖ్ ఆశిస్తున్నారు. అయితే, ఈ సారి ఆయన కలకత్తా జనాన్ని ఉత్సాహపరుస్తూ క్లబ్ హౌస్ లో నిలబడరు. 'బౌండరీ సమీపంలో కూర్చునేందుకు నన్ను అనుమతించవలసిందిగా నేను అధికారులను కోరవలసి ఉంటుంది. ఎందుకంటే జనంతో కలసి కూర్చోగలనని నాకు అనిపించడం లేదు' అని ఆయన చెప్పారు. 'ప్రేమాభిమానాలతో అనేక మంది నా చేతిని పట్టుకు లాగవచ్చు. అది గాయం కలిగించవచ్చు' అని షారుఖ్ అన్నారు.
సర్జరీ అనంతరం ఆయన పాల్గొన్న మొదటి షూటింగ్ కెకెఆర్ కోసం. టివి, నైట్స్, ఏంజెల్స్ కోసం చీర్ లీడర్ అన్వేషణ పోటీలో గెలుపొందిన అదృష్టవంతులైన ఆరుగురు యువతులకు ఆయన ఈ షూటింగ్ లో టైటిల్స్ ప్రదానం చేశారు. 'ఇది జట్టు కోసం బ్రాండ్ నిర్మాణ ప్రక్రియ. ఎందుకంటే ఇటువంటి షోల ద్వారానే నేను నైట్ రైడర్స్ గురించి మిగతా దేశ ప్రజలకు చెప్పగలను. వారు కోలకతా నైట్ రైడర్స్ బిల్ బోర్డు చూసి స్పందించరు. కాని ఈ ఇటువంటి షోల వల్ల దేశవ్యాప్తంగా ఇంటింటా ఈ జట్టు పేరు వినిపిస్తుంది' అని ఆయన పేర్కొన్నారు. ఎస్ఆర్ కెకు సంబంధించిన ఎంతో ప్రత్యేకత గల 'గెట్ వెల్' (ఆరోగ్యవంతులు కావాలి) అనే శుభాకాంక్షల సందేశానికి కూడా కలకత్తాతో సంబంధం ఉంది. 'మా జట్టు గెలుపొందడానికి ప్రధానంగా కావలసింది పూర్తి ఫిట్ నెస్. త్వరలో ఫిట్ కావలసిందింగా జట్టులోని ప్రధాన క్రీడాకారులకు నేను సందేశం ఇస్తున్నాను' అని ఈడెన్ గార్డెన్స్ ఇన్ చార్జి అయిన జగ్ మోహన్ దాల్మియా నుంచి వచ్చిన ఎస్ఎంఎస్ పేర్కొన్నది.
Pages: -1- -2- 3 News Posted: 6 March, 2009
|