హెలికాప్టర్ల హవా
సాధారణంగా ఒక్కో రాజకీయ పార్టీకి ఎన్నికల్లో తమ సీనియర్ నాయకులను ప్రచార పర్యటనకు తిప్పడానికి పది నుంచి పదిహేను హెలికాప్టర్లు అవసరం ఉంటాయి. గత ఎన్నికల్లో తాము ఎనిమిది హెలికాప్టర్లను వినియోగించామని, ఈ సారి కనీసం పదిహేను అవసరం పడతాయని బిజెపి సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు. వివిధ రాష్ట్రల్లో ఐదు దశలలో ఎన్నికల జరుగుతున్నందున ఈ హెలికాప్టర్లు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మామూలు రోజుల్లో హెలికాప్టర్ సామర్ధ్యాన్ని బట్టి అద్దెలు ఉంటాయి. సాధారణంగా పదిమందిని తీసుకెళ్ళగలిగిన హెలికాప్టర్ కు గంటకు లక్షా పాతిక వేలు, ఇరవై మందిని తీసుకెళ్ళెదయితే లక్షా అరవై వేలు అద్దెగా చెల్లించాల్సి ఉంటుంది. కాని ఎన్నికల సమయంలో ఈ అద్దెలు పెంచుతారు. రాజకీయ నాయకులు అవసరం, ఆతృతను గమనించి అద్దెను పెంచి చెబుతామని ఒక అధికారి వివరించారు.
మాకు ఎన్నికలకు మించిన అవకాశం ఉండదు. అందుకే సాధారణ అద్దెలను ఈ సమయంలో పెంచుతాం. అదనపు ఆదాయం సమకూర్చుకోడానికి ఇదే తరుణం కాదా? అంటూ గ్లోబల్ వెక్ట్రా హెలికార్ప్ కంపెనీ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎడ్వర్డ వాన్ డామ్ ప్రశ్నించారు. తమ కంపెనీకి 29 హెలికాప్టర్లు ఉన్నాయని, వాటిలో 22 హెలికాప్టర్లు సముద్రం మీద ఉండే ప్రాజెక్టులకు అద్దెకు వెళ్ళాయని, మిగతావి మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డిమాండ్ బాగుంటే ఆ 22 హెలికాప్టర్లలో కొన్నింటిని వెనక్కి పిలిపించే ఆలోచన చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Pages: -1- 2 News Posted: 6 March, 2009
|