ప్రియాంక - వారి బ్రహ్మాస్త్రం!
న్యూఢిల్లీ: జీవితంలో, ముఖ్యంగా రాజకీయాలలో సహోదరత్వానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందుకు రాహుల్ గాంధీ ఏమీ మినహాయింపు కాదు. ఇక ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తుతానికి రాజకీయ ఆకర్షణకు లోనుకాకపోయి ఉండవచ్చు. కాని తన సోదరుని నియోజకగవర్గం అమేథిలోను, తన తల్లి నియోజకవర్గం రాయబరేలిలోను ప్రచార నిర్వాహకురాలి పాత్రను పోషించాలన్న ప్రియాంక నిర్ణయం ఉత్తర ప్రదేశ్ (యుపి)లోని ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కు కొంతమేరకు జవసత్వాలను కలిగించవచ్చు.
ప్రస్తుతం నిర్ణయించుకున్న మేరకు ప్రియాంక ఏప్రిల్ లో అమేథికి తరలివెళ్ళి ఆ నెల 30న రాయబరేలిలో పోలింగ్ జరిగేంత వరకు అక్కడే ఉండగలరు. దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి సోనియా గాంధీకి, రాహుల్ కు సావకాశం కల్పించడం ప్రియాంక వ్యూహం. ఆమె భర్త రాబర్ట్ మధ్య మధ్యలో ఆమె దగ్గరకు వస్తుంటారు. కాని వారి పిల్లలు రెహాన్, మీరా మాత్రం ఎన్నికల పూర్తయ్యేంత వరకు తమ తల్లికి దూరంగా ఉండక తప్పదు.
37 సంవత్సరాల ప్రియాంక ఆ రెండు నియోజకవర్గాలలో దేనికీ అపరిచిత కాదు. అలాగే ప్రచార నిర్వాహకురాలి పాత్రా ఆమెకు కొత్త కాదు. ఆ రెండు నియోజకవర్గాలలో గాంధీ కుటుంబ సభ్యులకు పక్కా ఎన్నికల యంత్రాంగం ఉంది. ప్రియాంక బాల్యం నుంచే అమేథిని, రాయబరేలిని సందర్శిస్తున్నారు. 1999లో అమేథిలో సోనియా తొలిసారి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు, 2004లో రాయబరేలిలో సోనియా అభ్యర్థిగా ఉన్నప్పుడు ప్రియాంక మొత్తం ప్రచార బాధ్యతలను తన భుజస్కందాలపై మోశారు.
Pages: 1 -2- News Posted: 7 March, 2009
|