ప్రియాంక వారి బ్రహ్మాస్త్రం!
రెండు నియోజకవర్గాల వోటర్లను ఆమె ఆకర్షించినట్లు కనిపిస్తున్నది. నడుముపై చేతులు వేసుకు నిలబడి వృద్ధుడైన ఒక వోటరుతో మాట్లాడుతున్నట్లుగా బుధవారం జాతీయ పత్రికలలో ప్రచురితమైన ఆమె ఫోటోను చూస్తే ఆమె తన కొత్త బాధ్యత నిర్వహణలో ఎంతగా నిమగ్నమైందీ విదితం కాగలదు. ఇద్దరు గాంధీ వారసులలో చిన్నదైన ప్రియాంకను కాంగ్రెస్ లో అనేక మంది పార్టీ బ్రహ్మాస్త్రంగా పరిగణిస్తున్నారు. కాంగ్రెస్ కు తిరిగి పూర్వ వైభవం సాధించగల రాజకీయ నైపుణ్యం గల నాయకురాలుగా ఆమెను వారు పరిగణిస్తున్నారు. అమేథి ప్రజలకు భూత, భవిష్యత్ కాలాలకు వారధి. తన నాయనమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ లక్షణాలు కలబోసిన వ్యక్తి ఆమె. 'యేహ్ ఉన్ దోనోం కి ఉత్తరాధికారి హై' (ఆమె వారిద్దరి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు) అని అమేథి వాసులు కొందరు వ్యాఖ్యానించారు.
అయితే, అందుకు ఇంకా వ్యవధి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ప్రియాంక తనను రాహుల్, సోనియా తరఫున ప్రచారానికే పరిమితం చేసుకుంటున్నారు. 'నేను ఇక్కడ ఉన్నది నా సోదరునికి, తల్లికి సాయం చేయడానికే. దీని వల్ల వారు దేశమంతటా ప్రచారం చేయడానికి వీలు ఉంటుంది' అని ప్రియాంక అమేథిని సందర్శించిన సందర్భంగా విలేఖరులతో చెప్పారు. ఇతర నియోజకవర్గాలలో ప్రచారం చేయవలసిందిగా పుంఖానుపుంఖంగా అభ్యర్థనలు వస్తున్నప్పటికీ ప్రియాంకకు ఈ రెండు నియోజకవర్గాలను దాటి వెళ్ళే ఆలోచన లేదు. ఇక ప్రతిసారి ఎన్నికలలో వలె ఈ సారి కూడా ఆమె పార్టీ వాదులు, ముఖ్యంగా యుపి నాయకులు ఎన్నికలలో పోటీ చేయవలసిందిగా ఆమెను కోరుతున్నారు. కాని ఆమె అందుకు విముఖంగా ఉన్నారు.
Pages: -1- 2 News Posted: 7 March, 2009
|