గురుశిష్యుల కథ..?
(వరప్రసాద్ గాలిదేవర)
కొసమెరుపు
కాని బొత్స కుటుంబం ఎవ్వరూ ఊహించని కొసమెరుపుతో గురుశిష్యుల వివాదానికి శుభం కార్డు వేసింది. దీనికి శనివారంనాడు రాజధానిలోని మంత్రి అధికార నివాస గృహం వేదిక అయింది. గురుశిష్యులు ఇద్దరూ తాము చేసిన పొరపాటులను అంగీకరించారు. ఇంతకాలం అనుబంధాన్ని కేవలం పదవుల తెంచుకోరాదని, రుణానుబంధాలకు మూల్యంగా త్యాగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. గురువు కోరికను శిష్యుడు సత్తిబాబు మన్నించారు. శిష్యుని అభివృద్ధికి తాను బతికి ఉన్నంత కాలం తోడ్పడతానని గురువు మాట ఇచ్చాడు. మంత్రి సత్తిబాబు తన సతీమణి ఝాన్సి రాజకీయ జీవితానికి ఐదేళ్ళ పాటు విరామం ఇవ్వడానికే నిర్ణయించారు. విజయనగరం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడానికి సాంబశివరాజుకు అవకాశం కల్పించాలని, దానికి అవసరమైన అనుమతులను అధిష్టానం నుంచి తెచ్చే బాధ్యతను కూడా సత్తిబాబు తీసుకున్నారు. తన నిర్ణయం గురించి వివరించడానికి సోదరుడు అప్పలనర్సయ్యను, ఇతర సన్నిహితులను సత్తిబాబు హుటాహుటీన హైదరాబాద్ కు పిలిపించుకున్నారు.
తాను వృద్ధుణ్ణి అయిపోయానని, ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో కేవలం అసెంబ్లీకే పరిమితమైపోయానని, ఈసారి పార్లమెంట్ కు వెళ్ళాలన్నది తన ఆశని గురువు స్వయంగా కోరడంతో బొత్స కుటుంబం చలించిపోయిందని, అందుకే ఆయన కోరికను మన్నించారని సన్నిహితులు చెబుతున్నారు. బొత్స అధికార నివాసానికి శనివారం వచ్చిన సాంబశివరాజు ` తెలుగుపీపుల్' తో మాట్లాడుతూ విజయనగరం లోక్ సభ సీటుకు పోటీ చేసే సత్తా బొత్స కుటుంబానికే ఉందని చెప్పారు. తనకు పార్లమెంట్ కు వెళ్ళాలన్న కోరికను మంత్రి ఎదుట ప్రస్తావించానని, దానికి ఆయన అనుకూలంగా స్పందించారని వివరించారు. `నేను గెలిచినా పూర్తి కాలం బతికుంటానని నమ్మకం లేదు. అలాంటి అవకాశం వస్తే తప్పనిసరిగా మళ్ళీ సత్తిబాబు కుటుంబ సభ్యులే పార్లమెంటుకు వెళతారు. నా చివరి కోరికను సత్తిబాబు మన్నించడమే అతని ఉన్నతమైన సంస్కారానికి నిదర్శనం' అని ఆయన అన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 7 March, 2009
|