టిక్కెట్ లేని ప్రచారం!
మాకెన్ నియోజకవర్గంలో గడచిన రెండు నెలలలో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశాలలో గోయెల్ తరచు కనిపిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి టిక్కెట్ కోరడానికి ఆయన ప్రాతిపదిక ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో హేమమాలినిని పోటీ చేయించాలని బిజెపి పట్టుదలతో ఉన్నప్పటికీ విజయ్ గోయెల్ ఇలా ప్రచారం చేసుకుంటుండడం గమనార్హం. 'నా శ్రమను పార్టీ గుర్తించి నాకు ఇక్కడ నుంచి పోటీకి టిక్కెట్ ఇస్తుందని నమ్మకంతో ఉన్నందున నేను ముందుగానే ప్రచారం ప్రారంభించాను' అని గోయెల్ తెలియజేశారు.
అదేవిధంగా ఢిల్లీ సిట్టింగ్ బిజెపి ఎంఎల్ఎలు రమేష్ బిధూరి, జగదీష్ ముఖి కూడా ఇంటింటి ప్రచారాలు, బహిరంగ సభలతో ప్రచారం సాగిస్తున్నారు. ఇక కపిల్ సిబల్, సందీప్ దీక్షిత్ కొన్ని వారాలుగా తమ తమ నియోజకవర్గాలలో బహిరంగ ర్యాలీలు,సభలలో ప్రసంగిస్తున్నారు. దక్షిణ ఢిల్లీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న ఔటర్ ఢిల్లీ ఎంపి సజ్జన్ కుమార్ క్రితం వారం ఆ ప్రాంతంలో ఒక ర్యాలీలో ప్రసంగించారు. రాజకీయ వ్యాఖ్యాత మనోరంజన్ మహంతి మాట్లాడుతూ, 'ఈ నాయకులు పార్టీలో క్రియాశీలక సభ్యులు. తమ కోసమే కాకుండా వీరు తమ పార్టీల కోసం కూడా ప్రచారం సాగిస్తున్నారు. ఇదేమీ ముందస్తు ప్రచారం కాదు' అని అన్నారు.
Pages: -1- 2 News Posted: 8 March, 2009
|