సిడీలకు చరమగీతం!
న్యూఢిల్లీ: పుట్టిన ప్రతిదీ గిట్టక మానదన్నది నానుడి. ప్రపంచంలో ప్రతి అంశం ఉనికిలోకి వచ్చిన తర్వాత కొంత కాలం ప్రబల అంశంగా కొనసాగి, క్రమేణా కాలంచెల్లిపోయి అంతరించి పోవలసిందే. అదే బాణీలో స్టోరేజి సాధనాలు కూడా వరసగా ఒకదాని తర్వాత ఒకటి ఉనికిలోకి వచ్చాయి. గ్రాంఫోన్ రికార్డ్ల స్థానంలో జర్మన్ గ్రన్ డిగ్ స్పూల్ టేప్స్ వచ్చాయి. వాటిని పక్కన నెట్టి జపనీస్ కేసట్లు ప్రబలంగా ముందుకొచ్చాయి. జపాన్ కేసెట్లను పక్కకు నెట్టి సిడిలు దూసుకొచ్చాయి. ఇప్పుడు సిడిలకు కూడా కాలం చెల్లింపోయింది. సిడిల స్థానంలో క్రమంగా ఐ-పోడ్, యుఎస్ బి డ్రైవ్, కంప్యూటర్లు ఉమ్మడిగా కాంపాక్ట్ డిస్క్ లను వెనక్కి నెడుతున్నాయి. కాంపాక్ట్ డిస్క్ లు ఇక చారిత్రక విషయంగా మారిపోతున్నాయి.
కాంపాక్ట డిస్క్ పుట్టి సోమవారం నాటికి 30 ఏళ్లు పూర్తయ్యింది. డచ్ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫిలిప్స్ సంస్థకు చెందిన ఎంధోవెన్ లేబొరేటరీలో కాంపాక్ట్ డిస్క్ లు పురుడు పోసుకున్నాయి. అప్పటి నుండి దాదాపు 30 ఏళ్ల పాటు స్టోరేజి సాధనాలుగా సిడిలు ప్రపంచంలో రాజ్యమేలాయి. కేసట్లలో తలెత్తే సమస్యలకు పరిష్కారంగా, అత్యంత ప్రతిభావంతమైన ప్రత్యామ్నాయంగా, మరింత ఖచ్చితత్వంతో సిడిలు ఉనికిలోకి వచ్చాయి. సమాజంలో అత్యంత ప్రబలంగా మారిన సిడిలు ప్రస్తుతం నిష్క్రమించాల్సిన స్థితికి చేరుకున్నాయి.
Pages: 1 -2- News Posted: 10 March, 2009
|