త్వరలో సిడిల అంతర్ధానం
'సిడిలు శాశ్వతంగా కొనసాగవు. సమీప గతంలో సిడిలు అద్బుతమైన సంగీతాన్ని అందిచాయి. బొమ్మల్ని, సినిమాల్ని, వీడియో గేమ్స్ ను సిడిలు అందించాయి.' అని ఇంటర్నెట్ సైట్ జిజ్మోడో డాట్ కామ్ తెలిపింది. నోయిడా కేంద్రంగా వ్యాపారాన్ని సాగిస్తున్న ప్రపంచంలోనే పదిమంది అతిపెద్ద సిడిల తయారీదారుల్లో ఒకటైన మోజర్ బేయర్ బాలీవుడ్ సినిమాల్ని సిడిల్ల్ కెక్కించి అమ్మకాల్ని జోరుగా సాగిస్తోంది. స్టోరేజి సాధనాలు వస్తుంటాయి పోతుంటాయి, వాటిలో నిక్షిప్తం చేసే సమాచారం, విషయాంశాలు అంతకంటే గొప్పవి.
జర్మన్ గ్రన్ డిగ్ స్పూల్ టేపుల్ని జపాన్ దేశపు కేసెట్లు ప్రక్కకు నెడితే, ఆ కేసెట్లను సిడిలు పక్కకు నెట్టివేశాయి. అలాగే ఇప్పుడు సిడిలు కూడా ప్రక్కకు తప్పుకోవలసిన కాలం ఆసన్నమైంది. అత్యంత ప్రశాంతమైన జీవన శైలికి ప్రతీకగా 1982 అక్టోబర్ లో తొలి సిడి విడుదలైంది.2007 నాటికి 200 బిలియన్ల (20 వేల కోట్ల) సిడిలు ప్రపంచంలో అమ్ముడైనాయి. సిడిలు కొనసాగుతూ, చౌకగా ఎమ్ పి3 డిస్క్ లు రంగంలోకి వచ్చాయి. సిడి-ఆర్ ఓఎమ్ (రీడ్ ఓన్లీ మెమొరీ) కంప్యూటర్ డ్రైవ్ లుగా సిడిలు కొత్త అవతారమెత్తాయి. అయితే 1980 వ దశకంలో స్పష్టమైన మ్యూజిక్ మాజిక్ ను అందించిన సాధనాలుగా సిడిలు ఎప్పటికీ గుర్తుంటాయి.
Pages: -1- 2 News Posted: 10 March, 2009
|